Snake Romance Video Watch: ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అత్యంత ప్రమాదకరమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఈ పాములు అతి భయంకరమైనవిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ పాము కాటు బారిన పడితే తప్పకుండా నాడీ వ్యవస్థ దెబ్బతిని, మరణం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి చాలామంది వీటిని చూడగానే దూరంగా పరిగెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ పాములు ఎక్కువగా అడవుల్లో నుంచి తప్పిపోయి జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. అయితే వీటిని రక్షించేందుకు పాములు పట్టే వారికి పాత్ర పోషిస్తున్నారు. అతి ప్రమాదకరమైన పాములను కూడా పట్టుకుని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలేస్తున్నారు.
ఇలా పట్టుకునే క్రమంలో కొంతమంది వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంటర్నెట్లో తరచుగా పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు ఎవరో ఒకరు షేర్ చేస్తూనే ఉన్నారు. ఇందులో చాలావరకు కొన్ని వీడియోలు ట్రెండింగ్ గా కూడా మారుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా అంతే, ఈ వీడియో షేర్ చేసి చాలా రోజులైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా రెండు పాములు ఒకే చోట కలవడం అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. కానీ ఈ వీడియో దీనికి భిన్నంగా ఉంది. ఈ వీడియోలో రెండు పాములు ఒకే చోట కలుసుకొని ఒకదానికొకటి ముద్దు పెట్టేసుకుంటున్నాయి. వీడియోలో ముందుగా ఒక పాము ఇంకో పాము తల వద్దకు వెళ్లడం మీరు గమనించవచ్చు. ఇదే సమయంలో ఒక పాము తన కోరలు కూడా బయటికి చాచడం కూడా చూడొచ్చు. ఇలా రెండు పాములు ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా వచ్చి ముద్దు పెట్టేసుకున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
సాధారణంగా రెండు పాములు ఒకే చోట కలిస్తే భీకర యుద్ధమే జరుగుతుంది.. కానీ ఈ రెండు పాములు ఒక చోటికి వచ్చి చాలా క్లోజ్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఒకదానికొకటి కిస్ కూడా పెట్టుకున్నాయి. ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 32,000 మందికి పైగా లైక్ చెయ్యగా.. కొంతమంది కామెంట్లు కూడా చేశారు. ఈ వీడియోని ఇప్పుడు చాలామంది షేర్ కూడా చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు హరహర మహాదేవ అని కామెంట్లు కూడా రాస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









