King Cobra Video: ధన భాండాగారానికి కాపాలాగా రెండు కింగ్‌ కోబ్రాలు.. నగలను ముట్టుకుంటే అంతే సంగతి..

Two King Cobras Snakes Guarded Treasure Video Watch: ధన భాండాగారానికి కాపాలాగా ఉన్న కింగ్‌ కోబ్రాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పాములు ఏం చేస్తున్నాయో ఇప్పుడు చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 19, 2025, 08:05 AM IST
King Cobra Video: ధన భాండాగారానికి కాపాలాగా రెండు కింగ్‌ కోబ్రాలు.. నగలను ముట్టుకుంటే అంతే సంగతి..

Two King Cobras Snakes Guarded Treasure Video Watch Here: ధన భాండాగారానికి కాపాలాగా పాములు అనే అంశం అనేక కథలు, పురాణాలతో పాటు జానపద కథల్లో తరచుగా మనం విని ఉంటాం.. అయితే వాస్తవ ప్రపంచంలో ధన భాండాగారాలకు పాములను కాపలాగా ఉంచడం అనేది చాలా అరుదు.. అయితే దీనికి సంబంధించిన అనేక కథాలు ఇప్పటికీ కొన్ని పుస్తకాల్లో ఉన్నాయి. అలాగే పాములు సంపదకే కాకుండా దేవతా మూర్తులకు కూడా కాపాలాగా ఉండేవని సమాచరం.. ఉదాహరణకు, ఆదిశేషుడు విష్ణువుకు శయ్యగా ఉంటాడు. ఇలా పురానాల్లో అనేక కథల్లో పాములు కాపాలాగా ఉండడం ప్రస్తావించారు. 

Add Zee News as a Preferred Source

గతంలో రాజులు కూడా వారి సంపదను కాపాడేందుకు నిధికి విషపూరితమైన పాములను కాపాలాగా ఉంచేవారట..చాలా సందర్భాల్లో దొంగతనం జరిగేటప్పుడు పాములు సంపదను రక్షించేందుకు కీలక పాత్ర పోషించాయట.. అందుకే అప్పటి నుంచి రాజులు యుద్ధాల సమయంలో దోచుకున్న సంపద ఒక చోట చేర్చి, దానికి పాములను కాపాలాగా పెట్టేవారు. అంతేకాకుండా చాలా మంది రాజులు వీటికి ఆహారంగా పెద్ద పెద్ద జంతువులను కూడా ఆహారంగా వేసేవారు. అయితే తాజాగా రెండు పాములు సంపదకు కాపాలాగా ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజాగా వైరల్‌ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. రెండు కోబ్రా పాములను మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ పాముల ముందు బంగారం, అరుదైన ముత్యాల పేర్లు ఉండడం కూడా గమనించవచ్చు. అంతేకాకుండా వాటిని ముట్టుకోవడానికి వెళ్లిన వారిపై దాడి చేయడానికి బుసలు కొట్టడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.     అయితే ఈ రెండు కింగ్ కోబ్రాలు నిధికి కాపాలా కాస్తున్నాయని వీడియోలో క్యాప్షన్‌ పెట్టి పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతూ వస్తోంది. అయితే చాలా మంది దీనిని చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ వీడియోను @సబ్రినాసుల్తానా120 అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు 444 మంది సోషల్ మీడియా వినియోగదారులు లైక్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిని కొన్ని వేయిల మంది వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది నెటిజన్స్‌ కామెంట్స్‌ కూడా చేశారు. ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.. కానీ ఈ వీడియో అన్ని వీడియోలకంటే చాలా ప్రత్యేకం..

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News