)
Snakes romance each other in agriculture field video: ఇటీవల రకరకాల పాముల వీడియోలు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. చాలా మంది పాములు కన్పిస్తే భయంతో దూరంగా పారిపోతారు. ముఖ్యంగా ఎక్కడ పాము కాటుకు గురౌతామో అని జాగ్రత్తగా ఉంటారు. వర్షాకాలంలో పాములు ఎక్కువగా జతకడుతుంటాయి. అందుకే పాములతో చాలా మంది ఎంతో అలర్ట్ గా ఉంటారు.
ఈ సీజన్ లో మగ పాములు ఆడతోడు కోసం వెతుక్కుంటూ వెళ్తుంటాయి. దీంతో కొన్ని సార్లు అవి చాలా కోపంగా ఉంటాయి. పాములు ఒకదానికి మరోకటి పెనవేసుకుని ఉంటాయి.ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో నల్లని , గోధుమ రంగు నాగుపాములు సయ్యాటలాడుతున్నాయి.
రెండు కూడా పచ్చని చెట్ల మధ్యలో రొమాన్స్ కు దిగాయి. చాలా అరుదుగా మాత్రమే నల్లని , గోధుమ రంగు పాములు ఈ విధంగా జతకడతాయి. దీంతో కొంత మంది ఈ అరుదైన జంట సర్పాల సయ్యాటలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
కోబ్రాలు భలే ఉన్నాయ్ అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది నల్లని పాము, గోధుమరంగు పాములు కూడా రొమాన్స్ చేసుకుంటాయా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయితే..ఈ పాములు భారత దేశంలో ఎక్కువగా కన్పిస్తాయి. పంట పొలాల్లో, ఎలుకలు ఎక్కువగా ఉన్నచోట ఈ కోబ్రాలు ఎక్కువగా సంచారం చేస్తాయి.