)
Two snakes romance near water pond trending video: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాముల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది పాముల్ని చూస్తే దూరంగా పారిపోతే మరికొంత మంది మాత్రం పాములతో చెడుగుడు ఆడుకుంటారు. పాముల్ని మెడలో వేసుకుని డెంజరస్ స్టంట్ లు చేస్తారు. వీటికి ఆపద కల్గిస్తే కాలసర్పదోషాలు చుట్టుకుంటాయంటారు.
అందుకే చాలా మంది ఎక్కడ పాములు కన్పించిన వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు.ఈ క్రమంలో వానాకాలంలో పాములు ఎక్కువగా సయ్యాటలు ఆడుతుంటాయి. చెట్లలో, చెరువుల దగ్గర పాములు కన్పిస్తాయి. ఇటీవల నెటిజన్లు సైతం పాముల వీడియోల్ని ఎక్కువగా చూస్తున్నారు. అందుకే ఎక్కడ పాముల వీడియోలు కన్పించిన కూడా వాటిని తమఫోన్ లలో రికార్డు చేసి మరీ వైరల్ చేస్తున్నారు.
పాములు కాటు వేస్తే ఇటీవల కొంత మంది వాటిపై తమ ప్రతాపం కూడా చూపిస్తున్నారు. ఇలాంటి పనులు చేయోద్దని, పాములు ఇంట్లో రాకుండా జాగ్రత్తలు తీసుకొవాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు పాములు కూడ చెరువు గట్టు దగ్గరకు వచ్చాయి. మరీ అవి రెండు లవ్ లో ఉన్నాయో ఏంటో కానీ కాసేపు సయ్యాటలు ఆడుకున్నాయి. ఒకదాని కళ్లలో మరోకటి బానే చూసుకున్నాయి. కానీ ఇంతలో ఒక పాము చెరువులో దిగి మరోవైపుకు వెళ్లి పోయింది.
పాపం.. మరో పాము అలానే చూస్తు వీడ్కోలు.. అన్నట్లు చూస్తు ఉండిపోయింది.ఈ అరుదైన ఘటనను దూరం నుంచి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పాములకు కూడ భలే పీలింగ్స్ ఉంటాయా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.