Two Snakes romance on hand water pump video: సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో కోబ్రా స్నేక్ ల వెరైటీ వీడియోలను తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే భయంతో కళ్లు మూసుకుంటారు. మరికొన్ని వీడియోలు సరదగా నవ్వులు తెప్పించేవిలా కూడా ఉంటున్నాయి.
ముఖ్యంగా వానాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి చుట్టు అనవసర చెత్తా, చెదారం, చెట్లు లేకుండా చూసుకొవాలని నిపుణులు చెబుతుంటారు.
అయితే.. ప్రస్తుతం ఒక పాముల వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. సాధారణంగా ఇప్పటికి కొన్ని పల్లెటూర్లలో ప్రభుత్వ నల్లాలు, హ్యండ్ బోర్ లను నీళ్లు తాగేందుకు వినియోగిస్తుంటారు. కొంత మంది హ్యండ్ బోర్ లను అడ్డాలుగా మార్చుకుని నీళ్లను నింపే నెపంతో.. తమ గర్ల్ ఫ్రెండ్స్ తో గంటల కొద్ది ముచ్చట్లు పెడుతుంటారు. ఇదంతా మనం చూస్తు ఉంటాం.
కానీ ఇక్కడ మాత్రం రెండు సర్పాలు కూడా అచ్చం మనుషుల రూట్లను ఫాలో అవుతున్నట్లు ఉన్నాయి. రెండు పాములు ఏకంగా హ్యండ్ బోర్ ఎక్కేసి మరీ ఒక దాని మీద మరోకటి ఉండి, బుసలు కొడుతూ, ఒకదాని కళ్లలో మరోకటి చూసుకుంటూ సయ్యాటలాడుకుంటున్నాయి. అవి రెండు కూడా బోర్ ను చక్కగా పెనవేసుకున్నాయి. అక్కడి నుంచి వెళ్తున్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది కాస్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.









