Funniest Pets Videos 2025: పెట్ లవర్స్ కోసం స్పెషల్ వీడియో.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Viral Cat And Dog Videos: పెంపుడు జంతువుల ఫన్నీ వీడియోలు సోషల్‌ మీడియాలో తరుచుగా  వైరల్ అవుతాయి. ఎందుకంటే అవి చాలా మందికి ఆనందాన్ని పంచుతాయి. ప్రస్తుతం ఓ వీడియో పెట్ లవర్స్ నవ్వుకొనేలా ఉండటంతో ప్రజలు తెగ ఎగబడి చూస్తున్నారు.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Mar 21, 2025, 09:32 PM IST
Funniest Pets Videos 2025: పెట్ లవర్స్ కోసం స్పెషల్ వీడియో.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Viral Cat And Dog Videos: పెంపుడు జంతువులను పెంచుకోవడం అనేది చాలామందికి ఒక ఆనందకరమైన అనుభవం. పెంపుడు జంతువులు మన జీవితాల్లోకి ప్రేమ, స్నేహం,  సంతోషాన్ని తీసుకువస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా, కొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని ఎమోషనల్‌గా ఉంటున్నాయి. పెంపుడు జంతువులు చాలా క్యూట్‌గా ఉంటాయి. వాటి క్యూట్ చేష్టలు, ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్ అందరినీ ఆకర్షిస్తాయి. సోషల్ మీడియాలో పెంపుడు జంతువుల వీడియోలను షేర్ చేయడం చాలా సులభం. అందుకే అవి త్వరగా వైరల్ అవుతున్నాయి. ఈ కోవకు చెందిన ఓ వీడియోలు తెగ వైరల్‌ అవుతుంది.

Add Zee News as a Preferred Source

@animauxdrolesv5 అనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ లో పెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో పెంపుడు కుక్క, పిల్లలు చేసే కొంటె పనులు నెటిజన్‌లు తెగ నవ్వుకొనేలా చేస్తున్నాయి.  ఈ వీడియోలలో పిల్లి, కుక్కలు స్నేహపూర్వకంగా ఆడుకోవడం, ఒకరినొకరు వెంటాడటం,  కలిసి సరదాగా గడపడం వంటి దృశ్యాలు బోలెడు ఉంటాయి. పిల్లి, కుక్కలు చేసే కొన్ని ఫన్నీ చేష్టలు, అవి చేసే తప్పులు, వాటి వింత ప్రవర్తనలు నవ్వు పుటిస్తాయి. 

 

కొన్ని వీడియోలలో, పిల్లి, కుక్కలు తమ యజమానులతో చేసే ఫన్నీ సంభాషణలు, వాటి ప్రతిచర్యలు  వాటి ముద్దు ముద్దు ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్‌లను నవ్వుకొనే ఉంటాయి. ఈ వీడియోలు మనల్ని నవ్వించి, మన ఒత్తిడిని తగ్గిస్తాయి. జంతువులను పెంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెంపుడు జంతువులు మన జీవితాల్లోకి ప్రేమ, స్నేహం, సంతోషాన్ని తీసుకువస్తాయి. అవి మనల్ని ఒంటరిగా ఉండనివ్వకుండా మనకు తోడుగా ఉంటాయి. వాటిని ముట్టుకోవడం, వాటితో సమయం గడపడం వల్ల మన శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి.

పెంపుడు జంతువులను నడిపించడానికి బయటకు వెళ్లడం వల్ల కొత్త వ్యక్తులను కలవడానికి అవకాశం లభిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఇతరులతో మాట్లాడటం వల్ల మన సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. పెంపుడు జంతువుల సంరక్షణ కోసం మనం సమయం, శ్రద్ధను కేటాయించాలి. ఇది మనలో బాధ్యతను పెంచుతుంది, మనకు ఒక లక్ష్యాన్ని కలిగిస్తుంది. పెంపుడు జంతువులు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, మన జీవితాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి అనే దానికి ఈ వీడియోలు ఆదర్శము.
 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News