Journalist Viral Video: లైవ్‌లో జర్నలిస్ట్ కాలర్ పట్టుకున్న అంకుల్.. విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో..

Journalist Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి జర్నలిస్టు కాలర్ పట్టుకున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో.. ఆ వ్యక్తి కాలర్ పట్టుకోవడానికి గల కారణాలేంటో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 29, 2025, 12:07 PM IST
Journalist Viral Video: లైవ్‌లో జర్నలిస్ట్ కాలర్ పట్టుకున్న అంకుల్.. విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో..

Journalist Viral Video Watch Here: ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మంది తమది తాము ఆలోచిస్తూ ఇతరల గురించి ఆలోచించడం మానుకుంటున్నారు. ఇతరులు కష్టంలో ఉన్న వారిని పట్టించుకోకుండా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. ఇలాంటి సామాజంలో చాలా మంది అనేక కష్టాల మధ్య జీవితాన్ని సాగిస్తున్నారు. డబ్బు ఉన్నవారు, పేదవారిని పట్టించుకోవడం మనికుని, వారి పనులు వారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి సమాజంలో కూడా మానవత్వం కలిగి మనుషులు కొందరున్నారు. వీరు ఎల్లప్పుడు కష్టాల్లో ఉన్నవారికి సేవలు చేస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇలాంటి పని చేశారు. ఇప్పుడు ఆయన ఆ చిన్న పనితో అందరి మనుసులను దోచేస్తోంది. ఇంతకీ ఈ వీడియో ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

తాజాగా వైరల్‌ అవుతున్న వీడియో ఇప్పటికీ మానవత్వం ఉందని గుర్తు చేస్తోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. లైవ్ రిపోర్టింగ్‌లో బీజి ఉన్న ఓ జర్నలిస్ట్‌ కాలర్‌ మలిగి ఉండడం వల్ల.. అటు వైపుగా వెళుతున్న వ్యక్తి చాలా మర్యాదగా ఏ మాత్రం ఆలోచించకుంగా జర్నలిస్ట్‌ కాలర్‌ పట్టుకుని సరి చేశాడు. లైవ్‌ నడుస్తూ ఉండగా ఇలా చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. "నాకు ఇదంతా ఎందుకు అవసరం" అని ఏం ఆలోచించకుండా ఆతడు కాలర్ సరి చేయడానికి సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఘటన బంగ్లాదేశ్‌లో జరిగినట్లు సమాచారం.. రోడ్డు పక్కనే లైవ్‌లో మాట్లాడుతున్న జర్నలిస్ట్‌ లైవ్‌లో రిపోర్టింగ్‌ చేస్తుండగా.. దారి వెంటే వెళ్తున్న ఆ వ్యక్తి కాలర్‌ సరిచేయడంతో ఆయన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. ఈ వైరల్ అవుతున్న వీడియోను బంగ్లాదేశ్ జర్నలిస్ట్ రెద్వాన్ అహ్మద్ షావోన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.

ఇప్పటివరకు ఈ వీడియోను రెండు మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ వ్యక్తికి ఉన్న గొప్ప మనసును చూసి నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  కొంతమంది నెటిజన్స్ బాగోద్వేగానికి కూడా లోనవుతున్నట్లు కామెంట్ చేశారు. ఏది ఏమైనా సమాజంలో ఇలాంటి వారు ఇంకా ఉండడం అది ప్రపంచ గర్వకారణమని కొంతమంది చెబుతున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News