
Hathras professor assaulted girls in college video: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు కూడా మహిళలు, అమ్మాయిల వేధింపుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. బస్టాండ్, గుడి, బడి, ఆఫీస్, పబ్లిక్ ప్రదేశాలు.. చివరకు ఇంట్లో కూడా కొంత మంది మహిళలు తమ సొంత వాళ్లతోనే లైంగిక వేధింపులకు గురౌతున్నారు.
చివరకు అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్ కు వెళ్తే.. అక్కడ కూడా మహిళలు లైంగిక వేధింపులకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రి తర్వాత గురువుకు ఉన్నతమైన స్థానం కల్పించారు. కానీ కొంత మంది నీచులు మాత్రం.. పవిత్రమైన స్థానంలో ఉండి.. చదువులు చెప్పకుండా.. తమ స్టూడెంట్స్ పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. యువతులను మభ్యపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.
Hathras: A monster hiding in the temple of education!
Professor Rajnish Kumar of Seth PG Bagla Degree College, Hathras was sexually abusing girl students for 20 years! Police registered a case after more than 50 objectionable videos and pictures went viral.
? The college… pic.twitter.com/SpwJ4d3XOx
— Emotional_Accused (@Emotional7979) March 16, 2025
కొంత మంది ప్రాక్టికల్స్ లో మార్కులు వేస్తామని, మరికొందరు ర్యాంకులు వచ్చేలా చేస్తామని చెప్పి.. యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లోని హత్రస్ లోని ఒక కాలేజీలో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లోని ఒక కళాశాలలో రజనీష్ కుమార్ అనే వ్యక్తి చీఫ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఆ కాలేజీలో చదువుతున్న యువతుల్ని మభ్యపెట్టి వారితోనే రాసలీలలు కొనసాగించాడు. కొన్నేళ్ల నుంచి అతనిపై లైంగిక ఆరోపణలు వస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా.. అతని బండారం బైటపడింది. అతను అనేక మంది అమ్మాయిలతో రొమాన్స్ చేసిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దీనిపై యూపీ విద్యాశాఖ సీరియస్ అయ్యింది. కొంత మంది యువతులు సీక్రెట్ ఘటనను రికార్డు చేసి పోలీసులకు , ఉమెన్స్ కమిషన్ కు ఫిర్యాదులుచేశారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. సదరు కామాంధుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇతనిపై ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలిస్తున్నారు. కఠిన చట్టాల కింద పోలీసులు కేసులను నమోదు చేశారు. ప్రస్తుతం ఇతగాడి రాసలీలకు చెందిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం.. ఇతడ్ని వెంటనే సర్వీసు నుంచి తొలగించి.. సంపారానికి పనికి రాకుండా.. చేయాలని కూడా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe