Viral Video: ఇదెక్కడి ట్రెండ్ భయ్యా..!.. కట్నాలు ఇట్టా కూడా చెల్లిస్తారా..?.. నెట్టింట రచ్చగా మారిన వీడియో..

Upi scanner in bride neck: పెళ్లిలో కట్నాలు చెల్లించేందుకు కొత్త జంట ఫ్రెండ్స్ వెరైటీ ప్లాన్ చేశారు.  ప్రస్తుతం ఈవీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది. మీ ఐడియా భలేగా ఉందంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 18, 2025, 02:59 PM IST
  • పెళ్లికి దోస్తుల వెరైటీ ఐడియా..
  • నవ్వుకుంటున్న నెటిజన్లు..
Viral Video: ఇదెక్కడి ట్రెండ్ భయ్యా..!.. కట్నాలు ఇట్టా కూడా చెల్లిస్తారా..?.. నెట్టింట రచ్చగా మారిన వీడియో..

UPI Scanner in bride neck Video Goes viral: ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తొంది. ఎక్కడ చూసిన కూడా పెళ్లిళ్లతో మండపాలన్ని ఫుల్ బిజీగా ఉంటున్నాయి .వరుసగా మూహూర్తాలు ఉండటంతో వెడ్డింగ్ కు సంబంధించిన బిజినెస్ చేసే వారికి చేతి నిండా పని దొరికిందని చెప్పుకొవచ్చు. ఇక పోతే చాలా  మంది పెళ్లిళ్లలో ఏదో ఒక వెరైటీగా చేయాలని ప్లాన్ లు చేస్తారు.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా స్నేహితులు తమ దోస్త్ పెళ్లి ఎవరు మర్చిపోలేని విధంగా చేయాలని అనుకుంటారు. దీంతో వారి పెళ్లిళ్లు కాస్త ట్రెండింగ్ గా మారుతుంటాయి. పెళ్లిళ్లలో కొంత మంది కావాలని ఫన్నీఘటనల కోసం ప్లాన్ లు చేస్తే... మరికొన్ని సార్లు అనుకొకుండా ఏవో జరిగిపోతాయి. ఇక్కడ మాత్రం ఒక వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంది. కొత్త జంట ఫ్రెండ్స్ మండపానికి వచ్చారు.

 

ఇంకేముంది.. మనోడికి ఏదోలా సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశారు. వెంటనే యూపీఐ పెమెంట్ స్కానర్ ను రెడీ చేసి అతని మెడలో వేశారు. పెళ్లికి వచ్చిన అతని ఫ్రెండ్స్ అంతా.. కట్నాలు చదివింపులు మెడలో ఉన్న యూపీఐతోనే చేశారు. దీంతో అక్కడున్న వారంత భలేగా ఐడియా ఉందని ఫన్నీగా నవ్వుకున్నారు. మొత్తంగా కొత్తజంట ఫ్రెండ్స్ చేసిన పనికి వీళ్ల పెళ్లి కాస్త ఫన్నీగా మారిపోయింది.

Read more: Viral Video: రోడ్డు మధ్యలో టీ తాగుతూ రీల్స్.. పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తమదైన స్టైల్ లలో కామెంట్లు చేస్తున్నారు. భలే ట్విస్ట్ఇచ్చారుగా కొత్త జంటకు అని.. మరొ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News