up man gets wife marriage with her lover video: ఇటీవల కాలంలో చాలా మంది పెళ్లికున్న పవిత్ర బంధాన్ని పూర్తిగా దిగజారుస్తున్నారు.పెళ్లిచేసుకుని ఒకరికి తెలియకుండా.. మరోకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొంత మంది ఇతరుల మోజులో పడి, తమను పెళ్లి చేసుకున్న వాళ్లను హతమార్చేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాహేతర సంబంధాలతో అనేక మంది తమ కాపురాలను కూల్చుకుంటున్నారు. తమ చేజేతులా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇటీవల అనేక మంది భర్తలు.. తమ భార్యలు పెడుతున్న వేధింపులు తాళలేక సూసైడ్ లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక భర్త మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్యకు అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
? संतकबीरनगर: पति ने पत्नी की प्रेमी से करवा दी शादी ?
? चौंकाने वाली घटना सामने आई
? पति ने कहा- "तुम जाओ, बच्चों को मैं खुद पाल लूंगा"
? धनघटा थाना क्षेत्र के गांव का मामला#SantKabirNagar #ShockingNews #Marriage #LoveTriangle #FamilyDrama pic.twitter.com/3UcgUPn218
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) March 26, 2025
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని కబీర్ నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కటర్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూ 2017లో గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్ (8), శివానీ (3) ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో బబ్లూ తన కుటుబం కోసం దూర ప్రాంతంలో జాబ్ చేస్తు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే.. భార్య మాత్రం.. భర్త పడుతున్న కష్టాన్ని పట్టించుకొకుండా.. తన ఇంటికి సమీపంలో ఉండే వికాస్ మరో యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది.
వీరి యవ్వారం కాస్త భర్తకు తెలిసిపోయింది. ఈ క్రమంలో భర్త తన భార్యకు మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. గ్రామంలో అందరిని పిలిపించి..ఒక అఫిటవిట్ తయారు చేయించాడు. ఆమె ప్రియుడితో దనీనాథ్ శివాలయంలో వికాస్‌తో తన భార్య వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు. ఆతర్వాత తన పిల్లలకు,తనతో సంబంధంలేదని రాయించుకున్నాడు.
నువ్వు ప్రియుడితో వెళ్లిపొవచ్చని కూడా స్పష్టం చేశాడు. దీంతో అక్కడున్న వారంత షాక్ కు గురయ్యారు. వీరి పెళ్లిని చూసిన వారంత భర్తను పొగుడుతూ.. అతగాడి భార్య చేసిన పనికి మాత్రం మండిపడుతున్నారు. మొత్తంగా ఇలాంటి వాళ్లు ఉండేకన్నా.. వెళ్లిపోతేనే బెటర్ అంటూ అక్కడున్న వాళ్లు కూడా బబ్లూకే అండగా నిలిచారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









