woman tries second marriage to buy buffaloes in uttar Pradesh: సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలకు తమ వంతుగా సాయం చేసేందుకు పథకాలను అమలు చేస్తాయి. ముఖ్యంగా బీపీఎల్ కింద ఉన్న వారికి ప్రభుత్వం పథకాలు అందేలా సర్కారు చూస్తుంటుంది. సమాజంలో పేదలు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చే పథకాలు వారికి ఆసరాగా ఉంటాయి. అయితే.. కొన్ని ప్రభుత్వాలు ఇంటి సామాగ్రి ఇస్తే.. మరికొన్ని ప్రభుత్వాలు కిరాణా సామాగ్రిని ఇస్తాయి. అంతే కాకుండా.. ఉన్నత చదువుల కోసం స్కాలర్ షిప్ లు ఇస్తుంటాయి.
మరికొన్ని ప్రభుత్వాలు తమ కుటుంబాన్ని పోషించుకునేందుకుగాను.. గేదెలు, మేకలు, చేపల్ని సైతం లబ్ధి దారులకు ఇస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం యూపీ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బీపీఎల్ కింద ఉన్న లబ్దిదారుల కోసం.. గేదెల్ని కొనేందుకు నగదును అందజేస్తున్నారు.ముఖ్యంగా సాముహికంగా పెళ్లిళ్లు చేసి.. లబ్దిదారులకు రూ. 35 వేలు డబ్బులు ఇస్తారు. వీరంతా బీపీఎల్ కింద ఉండాలి.
అయితే.. ఈ క్రమంలో యోగి సర్కారు ఇస్తున్న ఈ పథకాన్ని కొంత మంది మోసంతో డబ్బుల్ని కాజేయాలని ప్లాన్ లు వేశారు. స్థానికంగా ఉండే..అస్మా అనే మహిళ అప్పటికే పెళ్లి అయ్యింది. ఆమె కొన్నిరోజులుగా భర్తతో గొడవలు జరిగి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువైన జబేర్ అహ్మాద్ ను రెండో పెళ్లిచేసుకుంటున్నట్లు అందర్నినమ్మించింది. అంతేకాకుండా.. సదరు మహిళ ప్రభుత్వం ఇచ్చే.. 35 వేల ధరఖాస్తుకు అప్లై చేసుకున్నారు.
దీనిలో భాగంగా.. సాముహిక వివాహాలుజరుగుతున్నాయి. వీరికి ప్రభుత్వ అధికారులు డబ్బులు ఇస్తున్నారు.వీరిద్దరు.. ప్రభుత్వం ఇచ్చే 35 వేల డబ్బులతో చెరో ఒక గేదె కొనుక్కొని దాని పాల అమ్మకంతో జీవనం సాగించాలని ప్లాన్ లు వేశారు. వీరి పెళ్లి జరిగే టైమ్ కు మొదటి భర్తు కుటుంబీకులు అక్కడకు వచ్చారు.
Read more: Bride attends Groups-2: జీలకర్ర బెల్లంతోనే గ్రూప్ 2 పరీక్షకు హజరైన నవ వధువు.. వీడియో వైరల్..
సదరు మహిళ యవ్వారం అంతాబైటపెట్టారు. దీంతో ఆమె షాక్ అయ్యింది. ఆమెను అధికారులు సైతం నిలదీశారు. దీంతో ఇద్దరు కూడా చేసినతప్పుల్ని అంగీకరించారు. వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వంను మోసం చేసేందుకు ప్రయత్నించిన వీరిపై.. పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటన వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









