)
Venomous King Cobra Video Watch: వానలు పల్లె ప్రాంతాలతో పాటు అడవుల్లో విస్తారంగా కురుస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కొన్నిచోట్ల విపరీతంగా వానలు పడుతున్నాయి. దీంతో అడవుల్లో ఉండే కొన్ని జీవులు జనావాసాల మధ్య సంచారం చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఈ సమయంలో ప్రమాదకరమైన పాములు జనావాసాల మధ్యకు వస్తాయి. కాబట్టి అన్ని కాలాలతో పోలిస్తే వానాకాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పాములు వరద నీటిలో కూడా కొట్టుకొచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. దీనికి సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో ఎన్నోసార్లు చూశాం. ఇప్పటికీ చాలామంది పాములకు సంబంధించిన వీడియోలను ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటున్నారు. ఇందులో భాగంగానే అప్పుడప్పుడు కొన్ని పాములకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా కూడా ఓ అత్యంత ప్రమాదకరమైన పాము కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వీడియో వివరాల్లోకి వెళ్తే.. పది అడుగుల అత్యంత ప్రమాదకరమైన నాగుపాము ఒక యువకుడి చేతిలో ఉండడం మీరు గమనించవచ్చు. ఈ వీడియోలో ఆ వ్యక్తి పామును ఒక చేతిలో పట్టుకొని నేలపై కూర్చుని ఉన్నాడు. అతను పామును కెమెరా వైపు చూపిస్తూ.. ఉండిపోయాడు. అయితే ఆ రాకాసి కింగ్ కోబ్రా కూడా.. యువకుడి ఎందుకంటే ఎక్కువగా పైకి లేచి దాని పడగను విప్పి కెమెరాకు ఫోజులిచ్చింది.. ఈ దృశ్యాలను చూసేందుకు అక్కడికి కొంతమంది పిల్లలు కూడా తరలిరావడం మీరు వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.
ఆ వ్యక్తి వీడియో చివరిలో ఆ పాముని నేలపైకి తీసుకువచ్చి ఇద్దరు వ్యక్తులకు అప్పగించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పది అడుగుల కింకోబ్రాలను పట్టుకోవడం చాలా అరుదు. అలాంటిది ఓ యువకుడు ఆ పాముని పట్టుకొని పైకి లేపి చూపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో చూసిన చాలామంది పాము ఉన్న స్థితిని చూసి వామ్మో అని అంటున్నారు..
ఈ ఘటనను చూసిన చాలామంది పాము సంచారం చేస్తున్న సమయంలో పట్టుకున్నందుకు ఆ వ్యక్తిని అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియో చూసిన కొంతమంది అటవీ శాఖ అధికారులు ఇలాంటి పాముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని.. వీటి కాటు వల్ల వచ్చే విషం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఇలాంటి పాములు కనిపించినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook