12 Foot King Cobra Video Viral Watch Here: కింగ్ కోబ్రా (ఓఫియోఫాగస్ హన్నా)లను ప్రపంచంలోని అతి పొడవైన విషపూరితమైన పాములుగా చెప్పుకుంటారు. ఇవి దాదాపు 10.4 నుంచి 13.1 అడుగుల వరకు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇదే జాతిలోని కొన్ని పాములు 19.2 అడుగుల పొడవు కూడా ఉంటాయి. ఇవి పొడవులోనే కాకుండా బరువు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. భారీ కింగ్ కోబ్రాలు భారతదేశంలో పాటు దక్షిణ చైనాలోని దట్టమైన అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. మనం తరచుగా ఇలాంటి కింగ్ కోబ్రాకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం..
పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలు ఎక్కువగా ఇతర పాములను మాత్రమే చప్పుకుని తినేందుకు ఇష్టపడాయి. అందుకే వీటిని "ఓఫియోఫాగస్" శాస్త్రీయ నామంలో పిలుస్తూ ఉంటారు. కింగ్ కోబ్రాలు సాధారణంగా పిరికి పాములైనప్పటికీ.. వాటి దగ్గరికి వెళ్లేవాటిపై తప్పకుండా దాడి చేస్తూ ఉంటాయి. అయితే గుడ్లు పెట్టే సమయంలో ఆడ కోబ్రాలు చాలా ప్రమాదకరంగా మారతాయి. ఈ సమయంలో వాటి దగ్గరి వచ్చే ఎలాంటి జంతువునైనా తప్పకుండా దాడి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా తమ గూడును కాపాడుకోవడానికి దూకుడుగా ప్రవర్తిస్తాయి. దాడి చేసే క్రమంలో ఈ కింగ్ కోబ్రాలు తమ శరీరం ముందు భాగాన్ని నేల నుంచి పైకి లేపి, మెడను వెడల్పుగా చేసి, భయానకమైన శబ్దం చేస్తాయి. ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ స్నేక్ క్యాచర్ akashjadav షేర్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక పెద్ద కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ పట్టుకోవడం మీరు చూడొచ్చు. స్నేక్ క్యాచర్ ఎంతో దగ్గరి నుంచి భారీ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఇంతలోనే ఆ పామును అతడిపై దాడి చేసేందుకు వస్తుంది. స్నేక్ క్యాచర్ తనకు ఉన్న సామర్థ్యాన్ని వినియోగించి చివరికి పామును పట్టుకుంటాడు ఈ వీడియోను @sarpmitra.akashjadav అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ వీడియోను ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









