
King Cobra Video Watch: అడవుల్లో అంతరించిపోతున్న జీవులను రక్షించే ప్రయత్నంలో ఓ వన్యప్రాణి సంరక్షణ బృందం అత్యంత అరుదైన ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను రక్షించింది. ఈ పాము దాదాపు 13 అడుగులకు పైగా పొడవు ఉన్నట్లు ఆ బృందం తెలిపింది. ఇప్పుడు ఈ పాముకు సంబంధించిన వీడియోనే ఇంటర్నెట్లో వైరల్ గా నిలిచింది. ఈ పాము అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంది. దీని శరీరం చూడడానికి చాలా మందపాటిగా కనిపిస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన తలభాగాన్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, ఈ విషపూరితమైన పాముకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో మొదటగా ఓ వ్యక్తి అత్యంత పొడవైన 13 అడుగులు కలిగిన భారీ కింగ్ కోబ్రాను పట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు. ఆ పాము అతని తలకు చుట్టుకొని ఉండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మరొకరు ఆ పాము తల పట్టుకొని ఆ యువకుడి మెడ నుంచి పాములు విడిపించడం మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇలా ఇద్దరు కలిసి ఆ పామును ఎటు వెళ్లకుండా చాలా గట్టిగా పట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు.. వారు ఆ పామును ఓ రూములోకి తీసుకెళ్లి వీడియోలో ఏం జరిగిందో పూర్తిగా వివరించడం మీరు చూడొచ్చు..
కింగ్ కోబ్రాకు సంబంధించిన జాతిలో ఈ పాము అత్యంత ప్రమాదకరమైంది. అంతేకాకుండా ఇది దాదాపు నాలుగు పాయింట్ 20 మీటర్లు పొడవు ఉందని వారు తెలిపారు. ఇలాంటి పాములు కేవలం అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయని.. వీటిని ఇతర జంతువుల నుంచి రక్షించడం ప్రకృతికి చాలా మంచిదని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.. అంతేకాకుండా కొంతమంది పాములను పట్టుకొని వాటి విష కోరాలను తొలగిస్తున్నారని.. దీనివల్ల పాముల జాతికే ప్రమాదమని ఈ వీడియోలో ఒకరు చెప్పడం మీరు గమనించవచ్చు. వారు ఆ పాముల కోరలను వీడియోలో చూపెడుతూ ఈ విషయాలను తెలపడం మీరు గమనించవచ్చు.
వీడియోలో వారు మాట్లాడుతూ.. మేము కేవలం పాములను సంరక్షించేందుకు మాత్రమే కృషి చేస్తూ ఉంటామని.. వాటి సహజ జీవితానికి ఎలాంటి హాని కలిగించమని వారు చెబుతున్నారు. ఇప్పటికీ వారు ఎన్నో జాతులకు సంబంధించిన పాములను రక్షించారని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పాములు గతంలో ఎన్నో వారు పట్టుకొని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలేసారని తెలిపారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి