Cobra Video Watch: 20 అడుగుల కోబ్రాను పట్టుకున్న శివంగి.. వీడియో ఇదే..

Venomous 20-foot King Cobra Video: 20 అడుగులు కలిగిన అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఓ లేడీ స్నేక్ క్యాచర్ పట్టుకున్న దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోలో యువతి పాముని పట్టుకొని గాల్లోకి లేపడం కూడా మీరు చూడొచ్చు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 8, 2025, 02:03 PM IST
Cobra Video Watch: 20 అడుగుల కోబ్రాను పట్టుకున్న శివంగి.. వీడియో ఇదే..

Venomous 20-foot King Cobra Video Watch: తాజాగా సోషల్ మీడియాలో ఓ యువతీకి సంబంధించిన యూట్యూబ్ షార్ట్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో యువతి అత్యంత ప్రమాదకరమైన పామును పట్టుకుంటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చాలామంది పూర్వికులు ఈ పాములు పట్టుకోవడాన్ని వృత్తిగా ఎంచుకునే వారు. అడవి నుంచి జనావాసాల్లోకి తప్పిపోయి వస్తున్న పాములను రక్షించి వీరు పర్యావరణంలో క్రియాశీలక పాత్ర పోషించేవారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ ఇదే వృత్తి కొనసాగుతూ వస్తోంది. నేటి యువత కొంతమంది వారి వృత్తిని వదిలిపెట్టకుండా చదువుకుంటూ మరి.. పాములను పట్టుకుంటున్నారు. ఈ సమయాల్లో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా చేసిన వీడియోలే ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి..

Add Zee News as a Preferred Source

సాధారణంగా మహిళలు పాములను చూస్తేనే భయపడి పారిపోతూ ఉంటారు. ముఖ్యంగా వాటి దగ్గరికి వెళ్లేందుకు కూడా వారంతగా ఇష్టపడరు. అలాంటివారు పాములు పడుతూ కనిపిస్తే సోషల్ మీడియా వినియోగదారులు ఊరుకుంటారా..? తప్పకుండా వీడియోను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను కూడా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు విపరీతంగా కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి అత్యంత ప్రమాదకరమైన దాదాపు 20 అడుగులు కలిగిన కింగ్ కోబ్రాను రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. 

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సమాచారం అందుకున్న ఆ యువతి ఓ పొలం దగ్గర పామును రెస్క్యూ చేసేందుకు వచ్చింది. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు పాము ఎక్కడ దూరింది అనేది ఆ యువతికి తెలిపారు. ఆ యువతి అక్కడికి నేరుగా వెళ్లి పట్టుకోవడం చూడొచ్చు. ఈ సమయంలో అత్యంత ప్రమాదకరమైన ఆ కింగ్ కోబ్రా ఆమెపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించింది. యువతి ముందుగా ఆ కింగ్ కోబ్రా తోకను పట్టుకొని తలభాగాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సమయంలో అది ఆమెపై దాడి చేసేందుకు యత్నించింది. 

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పామును తప్పించుకొని ఆ యువతి మరోసారి పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ పాము చాలా పెద్దది కావడంతో మరోసారి నేరుగా ఆ యువతి తలపై భాగంలో కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా చాకచక్యంగా దాని నుంచి తప్పించుకుంటుంది. చివరగా ఆ యువతి పామును లొంగ తీసుకొని పట్టేసుకుంటుంది. ఈ సమయంలో ఆ యువతీ తనకున్న ఎక్స్పీరియన్స్‌తో పామును గాల్లోకి లేపేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఎంతో జాగ్రత్తగా ఆ యువతి గాల్లోకి లేపడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News