)
Giant Anaconda Viral Video Watch Here: అమెజాన్ అడవుల్లో పర్యాటకుల పడవపైకి భారీ అనకొండ రావడం వారంతా భయాందోళనతో అటు ఇటు పరుగులు తీయడానికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది పర్యాటకులు అమెజాన్ అడవుల అందాలను చూసే క్రమంలో పడవలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన భారీ కింగ్ కోబ్రాలతో పాటు అతిపెద్ద అనకొండ పాములు కూడా ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. ఎటు చూసినా అనకొండలతో పాటు కొండచిలువలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి పాములు అప్పుడప్పుడు పర్యాటకులపై దాడులు కూడా చేస్తాయి. తాజాగా పర్యాటకుల పడవ పైకి వచ్చిన ఓ అనకొండకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారింది.
అమెజాన్ అడవుల్లో పర్యాటకులు నదిలో ప్రయాణిస్తున్న వేళ ఊహించని ఘటన ఎదురయింది. ఏకంగా అత్యంత ప్రమాదకరమైన ఓ అనకొండ పాము కొంతమంది పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవపైకి వచ్చేసింది. అయితే ముందుగా వారు దాన్ని చూసి అంతగా భయపడకపోయినా.. ఆ పాము వారి వైపు వస్తూ ఉండడం చూసి ఒక్కసారిగా పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడవ నుంచి దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలను మీరు కళ్ళకు కట్టినట్టు వీడియోలో చూడొచ్చు.
అయితే, ఈ ఘటనలో ఆ పాము ఎవరిపై దాడి చేయకుండా జస్ట్ పడవలో ఉన్న వారిని భయపెట్టే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా అనకొండ పాములు ఆకలేసినప్పుడు ఎంత పెద్ద జంతువులనైనా ఎంతో సులభంగా చంపుకొని తింటూ ఉంటాయి. అంతేకాకుండా పెద్ద జంతువులను సైతం ఎంతో సులభంగా మింగేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ వీడియోలో పామును చూస్తుంటే దాదాపు 25 అడుగుల పొడుగు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది జంతువు ప్రేమికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంతమందైతే ఈ వీడియో చూసి నిజమైన వీడియో కాదని గ్రాఫిక్స్ అని, మరి కొంతమందైతే ఏఐ జనరేట్ చేసిన వీడియో అని కామెంట్ చేస్తున్నారు. కొంతమందైతే వామ్మో ఆ పర్యాటకుల పరిస్థితి ఏంటి అని కామెంట్లలో పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి