4 Cobras Video: వామ్మో.. 3 పిల్లలతో కలిసి బయటికి వచ్చిన నాగుపాము.. పడగవిప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి..

Venomous 4 Cobras Video Watch: అత్యంత ప్రమాదకరమైన నాలుగు నాగుపాములు ఒకే చోట పడగవిప్పి ఆడుతున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇందులో మూడు చిన్న పిల్లలే ఉండడం ఆశ్చర్యమేస్తోంది. వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 6, 2025, 03:52 PM IST
4 Cobras Video: వామ్మో.. 3 పిల్లలతో కలిసి బయటికి వచ్చిన నాగుపాము.. పడగవిప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి..

Add Zee News as a Preferred Source

 Venomous 4 Cobras Video Watch Here: అత్యంత ప్రమాదకరమైన జాతి పాముల్లో నాగుపాముల జాతి ఒకటి. ఇవి చూడడానికి ఎంతో అందంగా కనిపించినప్పటికీ ఒక్కసారి దాడి చేస్తే మనిషి తప్పకుండా మరణిస్తాడు. చికిత్స త్వరగా అందితే బ్రతికే అవకాశాలు కూడా ఉంటాయి. అన్ని జాతుల కంటే ఈ జాతి పాములు చాలా ప్రత్యేకమైన చెప్పొచ్చు. ఎందుకంటే భారత సాంస్కృతిలో ఈ పాములను నాగదేవతలుగా భావిస్తారు. అలాగే సాక్షాత్తు దేవత మూర్తులుగా కూడా కొలుస్తారు. అలాంటి ఈ పాములు ఎక్కడ కనిపించిన కొంతమంది చంపకుండా వదిలిపెడుతూ ఉంటారు. అలాగే ఈ జాతి పాముల్లో ఆడ మగ రెండు ఉంటాయి. ఆడ పాములకు సంతాన సమయంలో మగ పాములు తోడుంటాయి.

ఆడ పాములు పిల్లల్ని పెట్టేవరకు ఎంతో జాగ్రత్తగా ఒకే చోట ఉంటాయి. పిల్లల్ని పెట్టిన తర్వాత వాటిని రక్షించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అలాగే పిల్లల్ని పెట్టిన తర్వాత కూడా వాటికి ఆహారాన్ని ఎలా సమకూర్చుకోవాలని అంశాలను కూడా నేర్పిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలోనే కొన్ని కొన్ని పాములు తన పిల్లలతో బయటకు వస్తూ ఉంటాయి. తాజాగా ఇలా బయటకు వచ్చిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను వైరల్ గా మారింది.

 
 
 
 
 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒకే చోట నాలుగు పాములు కనిపిస్తూ ఉండడం గమనించవచ్చు. ఈ వీడియోలో ఒక పెద్ద పాము తో పాటు మూడు చిన్న పాము పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా అందులో మూడు పిల్లలు ఒకదానికొకటి దాడి చేసుకోవడం కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు. మొదటగా ఒక పాము పిల్ల మరో పాము పిల్లపై దాడి చేయడం, ఆ తర్వాత ఆ నాలుగు పాములు పడగవిప్పి కనిపించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

ఈ వీడియోలో ఒకే చోట నాలుగు నాగుపాములు ఉండడం చూసి చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న పాము తన పిల్లలతో ఆహారం కోసం బయటికి వచ్చినట్లు కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. సాధారణంగా పాములు పిల్లలతో బయటికి రావడం చాలా అరుదు. కొద్దిగా పెరిగిన పిల్లలతో ఆహారం కోసం మాత్రమే బయటికి వస్తాయని వారంటున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ పేజి నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు చూశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News