Anaconda Vs Crocodile Video: మొసలిని చూసిన అనకొండా ఏం చేసిందో తెలుసా? ఈ అరుదైన వీడియో మీ కోసమే..

Anaconda Vs Crocodile Fight Video: నీటిలో మొసలిని చూసిన అనకొండా (Anaconda) పాము ఏం చేసిందో చూడండి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 22, 2025, 05:17 PM IST
Anaconda Vs Crocodile Video: మొసలిని చూసిన అనకొండా ఏం చేసిందో తెలుసా? ఈ అరుదైన వీడియో మీ కోసమే..

 Anaconda Vs Crocodile Fight Video: ప్రమాదకరమైన పాముల్లో అనకొండాలు (Anaconda) ఒకటి.. ఇవి దాదాపు 250 కేజీల నుంచి 300 కేజీల బరువు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పాముల శరీరం అన్ని పాముల కంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. 29 అడుగుల పొడవుండే ఈ పామలు చాలా ప్రమాదకరమైనవి. సాధారణంగా ఈ పాములు ఇసక భూములపై చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా నీటిలో ఉండేందుకు ఇష్టపడతాయి. అంతేకాకుండా ఇవి ఆహారంగా కూడా నీటిలో ఉండే పాములను ఎక్కువగా చంపుకుని తింటూ ఉంటాయి. ఇవి మోసళ్లలాగా నీటిలో చాలా యాక్టివ్‌గా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో గంటల పాటు నీటిలో ఉంటాయి. 

Add Zee News as a Preferred Source

భారీ శరీరం కలిగిన ఈ అనకొండాలు ఎదురైన ప్రతి జంవుతువుపై తప్పకుండా దాడి చేస్తూ ఉంటాయి. ఇలా దాడి చేసిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ అనకొండ పాము కూడా ఇలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  29 అడుగుల పొడవుగల ఓ భారీ అనకొండ పాము నీటిలోకి దిగడం మీరు చూడొచ్చు. అయితే అక్కడే పెద్ద మొసలి కూడా ఉండడం మీరు గమనించవచ్చు. అయితే మొసలి నీటిలోకి దిగుతున్న పామును గమనించి.. దాని దగ్గరికి వెళ్తుంది.

అనకొండా దగ్గరికి వెళ్లిన మొసలి దానిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే పాము చాలా తెలివితో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోను @Vex&Lor అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఒక నిమిషం నిడివి గల వీడియోను చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతారు. అయితే ఈ వీడియోను 6 సంవత్సరాల కింద సోషల్‌ మీడియాలో యూట్యుబ్‌లో పోస్ట్ చేశారు. అర్జెంటీనాలోని ఐబెరా నేషనల్ పార్క్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఫుల్‌ వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను 4 లక్షల మందికంటే ఎక్కువే సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. కొంతమంది నెటిజన్స్‌ కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News