Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..

Venomous Baby King Cobra Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడు 20 నుంచి 30 పాములను చేతిలో పట్టుకున్న దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 7, 2025, 03:19 PM IST
Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..

 Venomous Baby King Cobra Video Viral: భారతదేశంలో నివసించే అనేక జాతులకు సంబంధించిన పాములు గుడ్లు పెట్టడం ద్వారానే సంతాన ఉత్పత్తి చేస్తాయి. చాలా పాములు రహస్యంగా అడవి ప్రాంతాల్లో ఇసుకలో లేదా మట్టిలో ఒదిగి పెద్ద ఎత్తున గుడ్లను పెడుతూ ఉంటాయి. అంతేకాకుండా వాటికి రక్షణగా ఆడ పాములతో పాటు మగ పాములు కూడా అక్కడే ఉంటాయి. గుడ్లలో నుంచి పాముల పిల్లలు బయటకు వచ్చిన తర్వాత.. ఆడపామే వాటి బాగోగులు చూసుకుంటాయి. అంతేకాకుండా వేటాడడం కూడా నేర్పుతాయి. ఒక్కొక్క చోట కొన్ని పాములు అయితే 80 నుంచి 120 వరకు గుడ్లను పెట్టి పిల్లలను చేస్తాయి. 

Add Zee News as a Preferred Source

ఇక రక్త పింజర వంటి మరికొన్ని పాములైతే అవి నేరుగా వాటి పొట్టలో నుంచి పిల్లలకు జన్మనిస్తాయి. వాటి సంతానోత్పత్తి పొట్టలోనే జరిగి చిన్న చిన్న పిల్లలుగా తయారయి తల్లి పొట్టలో నుంచి బయటికి వస్తాయి. ఇలాంటి సమయాల్లో పాములు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అంతేకాకుండా కేవలం ఈ సమయంలో రక్త పింజరులు అడవి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ పాములు కొన్ని కొన్ని సందర్భాల్లో ఐదు నుంచి పది పిల్లలకు జన్మనిస్తాయి. కొన్ని కొన్ని పాములు జనావాసాల్లో కూడా గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే కొన్ని పిల్లలు బయటికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ యువకుడు ఒకే చేతులు పాముల పిల్లలను పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోను ఒక యువకుడు 20 నుంచి 30 వరకు చిన్న పాము పిల్లలను ఒక చేతిలో పట్టుకొని కెమెరాకు చూపించడం మీరు గమనించవచ్చు. ఇందులో ఉన్న పిల్లల్ని నాగుపాము కు సంబంధించినవి గానే ఉన్నట్లు వీడియోలో ఆ యువకుడు చెప్పడం మీరు వినొచ్చు..

 
 
 
 
 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

పదుల సంఖ్యలో ఆ యువకుడు చేతిలో పాము పిల్లలను పట్టుకోగా.. అందులో కొన్ని పాము పిల్లలు పడక విప్పి బుసలు కొట్టడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా మరికొన్ని పిల్లలు పడగవిప్పి మరి దాడి చేయడం మీరు క్లియర్‌గా గమనించవచ్చు. ఇక మరికొన్ని పాము పిల్లలైతే అటు ఇటు పాకడం కూడా మీరు చూడొచ్చు. ఇలాంటి అరుదైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వైరల్ అవుతున్న వీడియోను ఇప్పటివరకు 3,000 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. కొంతమంది దీనికి కామెంట్లు కూడా చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News