)
Venomous Cobra Drinking Water Video Watch: వన్యప్రాణి సంరక్షకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతి ఒక వీడియో వైరల్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా కొన్ని వీడియోలైతే కోట్లలో వ్యూస్ తెచ్చుకుంటాయి. అందులో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. జనాలు ఎక్కువగా పాములను రక్షిస్తున్న సమయంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకుంటున్న సమయంలో వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ వస్తున్నారు తాజాగా కూడా ఓ స్నేక్ క్యాచర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది..
పర్యావరణాన్ని కాపాడుతూ పాములను రక్షించడంలో స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది పాములు పట్టుకునే వృత్తిని ఎంచుకుని.. పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే చాలామంది పాములు పట్టుకుంటున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఓ స్నేక్ క్యాచర్ పాముకు నీటిని తాగిస్తున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
Munna Snake Rescuer అనే ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో యువకుడు ఏకంగా ప్లాస్టిక్ బాటిల్‌తో నీటిని తాగించడం మీరు గమనించవచ్చు. అయితే, ఆ పామును రెస్క్యూ చేస్తున్న సమయంలో.. దాహంతో ఉన్నదని గమనించి స్నేక్ క్యాచర్ ఆపాముకి ప్లాస్టిక్ బాటిల్‌తో నీటిని తలపై పోస్తూ ఉన్నాడు. ఆ పాము తన తలను లేపి నాలుకతో నీటిని తాగడం మీరు చూడొచ్చు.
52 సెకండ్ల నిడివి గల వీడియో ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అయితే, ఈ దృశ్యాలు చూసేందుకు చాలామంది స్థానికులు పామును పట్టుకుంటున్న చోటికి తరలివచ్చారు. పాములతో ఇలా సాహసోపేతమైన చర్యలకు పాల్పడ్డప్పుడు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేలమందికి పైగా వీక్షించగా.. 400 మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియో కామెంట్లు కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి