)
Venomous Cobra On Small Temple Video Here: ఇటీవల సోషల్ మీడియాలో ఓ కింగ్ కోబ్రా విలక్షణమైన ప్రవర్తనను చూపిస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పడక విప్పి ఓ చిన్న గుడి పై నిలబడి శరీరాన్ని విచిత్రంగా కదలిస్తూ ప్రదర్శిస్తున్న వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది.. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా నాగుపాములు ఇలాంటి ప్రవర్తనను కలిగి ఉండడం అరుదు. అలాంటిది ఈ నాగుపాము ఏకంగా చిన్న గుడిపై ఇలా విభిన్నంగా ప్రవర్తించడం చర్చనీయాంశానికి దారితీసింది.
వీడియో వివరాల్లోకి వెళితే..వీడియో ప్రారంభంలోనే ఓ అత్యంత ప్రమాదకరమైన నాగుపాము ఒక చిన్న గుడిపై పడగవిప్పి తలను పైకి లేపుతూ.. దాని శరీరాన్ని అటూ ఇటూ కదుపుతూ ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే కొద్దిసేపు అలా ఆడిన నాగుపాము.. కెమెరా ముందుకు రాగానే దానిపై వడగను పైకి లేపి దాడి చేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.
సాధారణంగా కింగ్ కోబ్రాలు ఇలా యాక్టివ్‌గా ఉన్నప్పుడు వాటిని కెలకక పోవడం చాలా మంచిది. ఎందుకంటే యాక్టివ్‌గా ఉన్న సమయంలోనే అవి దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయట.. అందులో కింగ్ కోబ్రా విషం చాలా ప్రమాదకరమైంది.. కాబట్టి ఇది దాడి చేసినప్పుడు సరైన సమయంలో చికిత్స లభిస్తేనే మనిషి బ్రతకగలుగుతాడు. ఈ వీడియోలో ఉన్న నాగుపాము కూడా అత్యంత ప్రమాదకరమైందేనని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పాముల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వారు అంటున్నారు.
ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి భిన్నాభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఈ వీడియో చూసి హర హర మహాదేవని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది అయితే, ఇలాంటి పాములు నాకస్సలు ఇష్టం ఉండదని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న వీడియో సర్ఫెంట్ షార్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేలమందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను లైక్ కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి