Venomous Cobra Video Viral: నిత్యం సోషల్ మీడియాలో యూట్యూబ్ షార్ట్స్‌కు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. చాలామంది ఈ షార్ట్ వీడియోలను ఎక్కువ మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన అరుదైన వీడియోలను, ఫన్నీ సన్నివేశాలను, సింగింగ్ ప్రోగ్రామ్స్‌ని ఎక్కువగా చూసి షేర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలైతే నిత్యం మూడు నుంచి నాలుగు గ్రూపుల్లో షేర్ అవుతూనే ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా పాములకు సంబంధించిన వీడియోలు సృష్టించి పోస్ట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇలాంటి ఏఐకి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను మిస్టర్ తేజు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. కేవలం 6 సెకండ్లు నిడివి గల వీడియోనే ఇప్పుడు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక పాము డోరు తీసుకొని మరి బెడ్ రూమ్‌లోకి ప్రవేశించి ఆంటీ పై దాడి చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు చూడొచ్చు. అయితే, పాము సడన్‌గా తలుపును తోసేసి బెడ్ రూమ్‌లోకి దూసుకు రావడం చూసి చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు. ముందుగా ఈ వీడియోను చాలామంది నిజం అనుకున్నారు. కానీ క్లియర్‌గా గమనించి చూసిన వారికి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియో అని తెలిసింది.
కొంతమంది ఈ వీడియో చూసి నవ్వుకుంటున్నారు. పాములు ఇలా తలుపులు తోసుకొని బెడ్ రూమ్ లోకి రావడం ఏంటని.. ఆశ్చర్యపోయి వీడియోను మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోకు Snake Attack on Mom అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఈ వీడియోకు కామెడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అనే టాక్స్ పెట్టి షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ఎంతగానో అందర్నీ అలరిస్తోంది.
చూడడానికి ఈ వీడియో చిన్న క్లిప్ అయినప్పటికీ.. దీనికి మంచి రీచ్ వస్తోంది. ఈ వీడియోలో కనిపించే పాము చూడడానికి నాగుపాముల ఉంది. అంతేకాకుండా పడగవిప్పి పరిగెత్తుకు రావడం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా 2000 మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియోలు చాలామంది ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









