Cobra On Shivalinga Latest Video Viral: సోషల్ మీడియాలో ఆలయంలో ప్రత్యక్షమైన నాగుపాములకు సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు ఇప్పటివరకు చూసాం.. ఇలాంటి వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఏకంగా నాగుపాము శివలింగంపై ప్రత్యక్షం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా దేవాలయం సమీపంలో, దేవాలయంలోకి ప్రమాదకరమైన నాగుపాములు రావడం సర్వసాధారణమే. కానీ ఈ వీడియోలో ఏకంగా నాగు పాము శివలింగంపై దర్శనం ఇచ్చింది. ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే... అడవిలో ఓ శివలింగంపై నాగుపాము పడకవిపి నిలబడి ఉండడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఆ నాగుపాము శివలింగం చుట్టూ చుట్టుకుని ఉండడం గమనించవచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దగ్గరుండి వీడియోని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోను చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు.. అంత ఆ ఈశ్వరుడి మహిమేనని భావిస్తున్నారు. మరి కొంతమంది ఈ వీడియోను చూసి ఎవరో కావాలని శివలింగంపై పెంచుకున్న నాగుపామును వదిలి వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కామెంట్లలో రాస్కొస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ క్రియేట్ చేసిన వీడియోని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోని క్లియర్‌గా గమనించి చూస్తే..
సాధారణంగానే ఆ నాగుపాము శివలింగంపై ప్రత్యక్షమైందని భావించవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను స్నేక్స్ సేవర్ బ్రదర్స్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 300 మంది సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది. ఇక మరి కొంతమంది అయితే శివుడి అనుగ్రహం వల్లే ఈ వీడియో కనిపించిందని షేర్లు కూడా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









