)
Cobra Hood Video: మానవ ఆవాసాల్లోకి తప్పిపోయి వచ్చిన పాములను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది రోజులు పదుల కొద్దిపాములను పట్టుకుంటున్నారు. మరికొంతమందైతే పాములను పట్టుకుంటున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ఈ వీడియోలు అప్పుడప్పుడు ట్రెండింగ్‌లోకి కూడా వస్తున్నాయి. తాజాగా ఓ పాము కు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. అత్యంత ప్రమాదకరమైన అడవి నాగుపామును రెస్క్యూ చేస్తున్న సందర్భంలో తీసి పోస్ట్ చేసిన వీడియోని ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.
స్నేక్ జాయ్ ఉజిరె (Snake JOY Ujire) అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన నాగుపామును బంధించిన బాక్స్‌ను పట్టుకొని అడవి ప్రాంతంలోకి వెళ్లడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత అతడు ఒక దగ్గర బాక్స్ ను అన్‌లాక్ చేసి.. వేరొక చోటికి వెళ్లడం కూడా మీరు చూడొచ్చు. ఇలా చివరగా అతను ఒకచోట బాక్స్‌ను ఉంచి ఓపెన్ చేశాడు.. దీంతో అందులో నుంచి అత్యంత ప్రమాదకరమైన నాగుపాము బయటికి రావడం గమనించవచ్చు. అదే బాక్సులో ఉండి ఆ పాము పడక విప్పడం మీరు చూడొచ్చు..
స్నేక్ క్యాచర్ జనావాసాల్లో తిరిగే పాములను పట్టుకొని.. ఇలా పాములను అడవుల్లో వదిలిపెడుతున్నట్లు గతంలో ఎన్నో వీడియోలు చూసాం. ఈ వీడియో కూడా అదే ఘటనకు సంబంధించినట్లు తెలుస్తోంది. మొదటగా చాలామంది బాక్సులో ఏదో ఉందనుకున్నారు. కానీ ఆ బాక్స్ ఓపెన్ చేసి సరికి.. ఒక్కసారిగా అందులో నుంచి నాగుపాము రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పాము బాక్సులో నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ దృశ్యాలే వైరల్ గా మారాయి. సాధారణంగా ఇలాంటి అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా అరుదని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook