
Cobra Viral Video Watch Here: నాగుపాములు చాలా ప్రమాదకరమైనవి. అంతేకాకుండా విషపూరితమైనవి. ఇవి ఒక్కసారి దాడి చేస్తే తప్పకుండా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. అంతేకాకుండా దీనివల్ల ప్రాణానికి ప్రమాదం అవుతుంది. గత కొన్ని నెలల నుంచి ఇంటర్నెట్లో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇలాంటి వీడియోలను ఎక్కువగా ఆసక్తిగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా నల్లత్రాచు, నాగుపాములు, కొండచిలువ పాములకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు ట్రెండింగ్ లో కూడా నిలుస్తున్నాయి. తాజాగా నాగుపాముకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
పంట పొలాల్లో, మక్కా చెరుకు చేనులలో పాములు ఎప్పుడు పడితే అప్పుడు సంచారం చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో కూడా ఓ పాము మొక్కజొన్న దిగుబడులపై ఏమాత్రం భయం లేకుండా పంమరివిప్పి మరి కూర్చుంది. అక్కడే ఉన్న రైతు ఒక్కసారిగా భయపడిపోయాడు. సాధారణంగా పాములు ఇలా అప్పుడప్పుడు ప్రత్యక్షమవడం సర్వసాధారణం. కానీ ఇలా పడగ విప్పి మరి బుసలు కొడుతూ.. కనిపించడం చాలా అరుదు.. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా భయపడిపోతున్నారు.
భారీ సెక్యూరిటీ #viralvideo #snake pic.twitter.com/KKKFcjEZKW
— srk (@srk9484) June 3, 2025
వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక రైతు తన మొక్కజొన్న దిగుబడిని చూసేందుకు పంట పొలం వద్దకు వెళ్లగా.. ఆ మొక్కజొన్న రాసిపై పడక విప్పిన కింగ్ కోబ్రాను చూడవచ్చు. అయితే దీనిని గమనించిన రైతు అటుగా వెళుతున్న పాములు పట్టే వాడిని పిలిచి..నాగస్వరం బూరను ఊదించడం కూడా మీరు చూడవచ్చు. ఇదే సమయంలో ఆ పాములు పట్టేవాడు అలవోకగా ఆ పామును పట్టుకొని బుట్టలో వేసుకొని వెళ్లిపోయాడు. అయితే ఈ సమయంలో నాగు పాము ఏ మాత్రం దాడి చేయకుండా ఆ పాములు పట్టే అతడికి లొంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook