)
Venomous Cobra snake Angry on snake catcher Trending video: సాధారణంగా ప్రాణాల మీద తీపి ఉన్నవారు ఎవరైన పాములంటే భయంతో దూరంగా పోతారు. కానీ కొంత మంది మాత్రం పాములతో అస్సలు భయపడరు. వాటిని ఏదో ఆటవస్తువుల్లా ఫీల్ అవుతుంటారు. వానాకాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తాయి. చెరువులు, గుట్టలు సమీపంలో ఉండే ఇళ్లలో పాములు తరచుగా సంచరిస్తుంటాయి.
పాముల వీడియోలు ఇటీవల నెట్టింట ఎక్కువగా వైరల్గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక నీలిరంగు బుసలు కొడుతున్న పాము వీడియో నెట్టింట సందడి చేస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో నీలం రంగులో భారీ నాగు పాము కోపంగా బుసలు కొడుతుంది. అది ఆకాశం రంగులో ఉంది. ఇంతలో స్నేక్ క్యాచర్ ఆ పామును బంధించేందుకు ప్రయత్నించడంతో ఆ పాము కాటేసేందుకు ప్రయత్నించింది.
పాము ఎంతో కోపంగా స్నేక్ క్యాచర్ పలు మార్లు కాటు వేయడానికి ప్రయత్నించింది. కానీ స్నేక్ క్యాచర్ కొంత జాగ్రత్తగా ఉండటం వల్ల పాము కాటు నుంచి అతను తప్పించుకున్నాడు. పాము మాత్రం నీలం రంగులో చాలా డెంజర్ గా ఉంది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.మరీ ఇంత ఘోరంగా ఉందేంటీ బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.