)
Venomous Cobra Snake attacks on Snake catcher Video: ఇటీవల కాలంలో పాముల వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, దట్టంగా చెట్లు ఉన్న ప్రదేశంలో పాములు ఎక్కువగా సంచారం చేస్తాయి. ముఖ్యంగా వానాకాలంలో పాములు జనావాసాల్లోకి వస్తాయి. దీంతో ప్రజలు పాముల కాటుకు గురౌతుంటారు. కొంత మంది పాములు కన్పిస్తే మరల ఆ ప్రదేశంకు వెళ్లరు. మరికొంత మంది పాములు కన్పిస్తే వెంటనే స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇస్తారు. కొంత మంది పాములతో స్టంట్ లు చేస్తారు.
ఇలాంటి క్రమంలో కొన్నిసార్లు పాముకాటు ఘటనలు వెలుగులోకి వస్తాయి. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్న పాము కాటు ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. ఒక స్నేక్ క్యాచర్ భయంకరమైన నాగు పాముతో స్టంట్ లకు దిగాడు. అది కోపంతో బుసలు కొడుతూ దాడికి రెడీ అయిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
దీనిలో స్థానికంగా ఉన్న ఇంట్లో పాము బైటపడింది. అది ఎంతో కోపంగా బుసలు కొడుతుంది. మరీ దాన్ని చూడగానే ఇంట్లో వారు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చాడు.వెంటనే అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ టీమ్ పామును పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. చేతికి గ్లౌజ్ లు వేసుకుని పాము దగ్గరకు వెళ్లారు. దీంతో అది కోపంతో పలు మార్లు కాటువేసేందుకు ప్రయత్నించింది. అతను కూడా ఏమాత్రం భయంలేకుండా దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
కానీ అది పలు మార్లు కాటువేసింది. కానీ అతను మాత్రం చాకచక్యంగా పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.కోబ్రా నల్లగా మెరుస్తూ ఎంతో కోపంగా ఉంది. మొత్తంగా ఈ ఘటనను వీడియో తీశాడు.అది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇలాంటి స్టంట్ లు అవసరమా.. అంటూ ఫైర్ అవుతున్నారు.