Snake Bite News: ఇదెక్కడి విడ్డూరం.. యువకుడ్ని కాటేయగానే ప్రాణాలు వదిలిన విషపూరితమైన పాము.. ఎక్కడంటే..?

Madhya Pradesh: పాము కాటు వేసిన కొన్ని నిముషాల్లోనే  విలవిల్లాడిపోయి ప్రాణాలు వదిలింది. ఈ ఘటనతో అతగాడు భయంతో పరుగులు పెట్టారు. వైద్యులు కూడా కూడా ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 20, 2025, 12:52 PM IST
  • మధ్య ప్రదేశ్ లో వింత ఘటన..
  • ప్రాణాలు వదిలిన కాటు వేసిన సర్పం..
Snake Bite News: ఇదెక్కడి విడ్డూరం.. యువకుడ్ని కాటేయగానే ప్రాణాలు వదిలిన విషపూరితమైన పాము.. ఎక్కడంటే..?

cobra snake dies after biting young man in madhya pradesh: సాధారణంగా పాములు అడవులు, పొలాలు, చెట్లు చెమలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఎలుకలు ఉన్న చోట కూడా పాములు ఎక్కువగా సంచారం చేస్తుంటాయి. ఈ  క్రమంలో వానాకాలంలో పాముల కాటుకు చెందిన ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తుంటాయి.సాధారణంగా పాములు చాలా విషపూరీతంగా ఉంటాయి.

Add Zee News as a Preferred Source

సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయించుకొకపోతే.. విషం శరీరం అంతవ్యాపించి ప్రాణాలు పొవాల్సిందే. అయితే..ప్రస్తుతం ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కాటు వేసిన వ్యక్తికి బదులు ..నాగు పాము గిల గిల కొట్టుకుని ప్రాణాలు వదిలింది. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.

 మధ్య ప్రదేశ్ లోని ఖుద్సోడి గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే.. సచిన్ నాగ్‌పురే (25) అనే యువకుడు కార్ మెకానిక్‌గా పనిచేస్తుంటాడు.  ఇతను..ఇటీవల.. తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అప్పుడు గమనించకుండా.. ఒక పాము మీద కాలు వేశాడు. వెంటనే అదికోపంతో అతనిమీద కాటు వేసింది.  అతను భయపడిపోయి వెనక్కు జరిగి బాధతో దానివైపు చూస్తున్నాడు.

మరీ కాటు వేసిన పామును ఒకసారి చూసి, దాని ఆనవాళ్లు డాక్టర్లకు చెప్దామని చూస్తున్నాడో కానీ.. ఆ పాము ఇంతలో గిల గిల కొట్టుకుంటూ తన ప్రాణాలు విడిచింది. అతను ఇంకా భయపడిపోయి,అక్కడున్న మిగతవారిని అరిచి పిలిచాడు. వెంటనే యువకుడ్ని కాటు వేసిన పాముతో సహా వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. ఆ పామును గమనించిన వైద్యులు  ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన డొంగర్‌బేలియా జాతికి పాముగా చెప్పారు.

మరోవైపు పాము కాటుకు గురైన సచిన్ కు వైద్యులు యాంటివీనమ్ చికిత్స చేశారు. అతను కోలుకుంటున్నాడు. మనిషిని కాటువేసిన పాము వెంటనే చనిపోవడం అత్యంత అరుదైన విషయమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. గత పదేండ్లుగా.. తాను.. మామిడి, తూవాల్, కానుగ, ఆజన్ వంటి చెట్ల పుల్లలతో పళ్లు తోముకొవడం వల్ల.. తన శరీరంలో ఈ మూలికా వృక్షాల కలయిక వల్ల తన రక్తం పాముకు విషపూరితంగా మారి  ఉండొచ్చని అతను చెప్పాడు.

ఇక ఫారెస్ట్ సిబ్బంది ధర్మేంద్ర బిసెన్ మాత్రం..కొన్నిసార్లు కాటు వేసిన తర్వాత పాము తన శరీరాన్ని బలంగా మెలితిప్పుతాయి. ఈ క్రమంలో దాని విషపుతిత్తి పగిలిపోయి, ఆ పాము మరణించి ఉండొచ్చని కూడా వివరించాడు. ఏదీ ఏమైన  ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో వార్తలలో నిలిచింది.

Read more: Snake bite Facts: కాటు వేయడానికి పామురెడీగా ఉందా..?.. ఈ ఒక్కపనిచేస్తే కోబ్రా కూల్ గా సైడ్ అయిపోవాల్సిందే.!. 90 శాతం మందికి తెలియని రహస్యం.!.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News