King Cobra Video: అమ్మ బాబోయ్.. ఫ్రిజ్‌లో భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూశారా?

Huge King Cobra In Fridge Video Watch Here: ఫ్రిడ్జ్‌లో కూర్చున్న పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన  సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకోండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 25, 2025, 04:30 PM IST
King Cobra Video: అమ్మ బాబోయ్.. ఫ్రిజ్‌లో భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూశారా?

 Huge King Cobra In Fridge Video: పాములు అంటే అందరూ భయపడుతూ ఉంటారు. ఎంతో ధైర్యం ఉన్నవారు కూడా ఒక్క పాము చూడగానే మైలు దూరం వరకు పరిగెడుతూ ఉంటారు. వాతావరణంలోని కాలుష్యం పెరగడం కారణంగా అడవుల సాంద్రత తగ్గిపోతుంది దీని కారణంగా అడవుల్లో ఆహారం లభించక జంతువులు పాములు తరచుగా జనావాసాల్లో దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఉండే కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పొడవైన విషపూరితమైన పాములు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాటిని పట్టుకొని రక్షిస్తున్న క్రమంలో చిత్రీకరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి. చాలామంది స్నేక్ క్యాచర్స్ ఇలా పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన వీడియో అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఇంతకీ ఈ వీడియో ఏంటో? వైరల్ అవ్వడానికి గల ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Add Zee News as a Preferred Source

చాలా పాములు ఇళ్ళలోకి ప్రవేశించి చిందరవందరంగా వస్తువులు ఉండే చోట్లలో నక్కుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఓ కింగ్ కోబ్రా ఫ్రిడ్జ్ లో హాయిగా కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను బ్రభు కింగ్353 అనే ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో కనిపించిన వివరాల ప్రకారం.. ఓ స్త్రీ అనుకోకుండా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది అయితే అందులో కింగ్ కోబ్రా పాము తల పైకి లేచి నాలుకను అటూ ఇటూ తిప్పడం మీరు గమనించవచ్చు. అయితే ఈ పాము ఫ్రిడ్జ్ లోకి ఎలా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియక ఇంటి యజమానులు సతమతమవుతున్నారు.  ఆ మహిళ పామును చూసిన వెంటనే ఫ్రిడ్జ్ డోర్ మూసేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

 
 
 
 
 

ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది అంతేకాకుండా సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. "వేసవిలో ఇంటి మూలల్లో లేదా బాత్రూంలో ఉండే నీటిలో, బూట్లు వేసుకునే క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని" కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది. అయితే "పల్లె ప్రాంతాల్లో నివసించే వారు పాముల బెడద ఎక్కువగా ఉన్నవారు వేసవిలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని" చెబుతున్నారు. ఇంకొంతమంది అయితే.. "వావ్ కింగ్ కోబ్రా.. తన కోరిక తీర్చుకునేందుకు ఫ్రిజ్లో కూర్చుంది" అని కామెంట్ చేయగా.. అది ఫ్రిడ్జ్ లోకి వెళ్లి కూర్చోవడం చూస్తే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుందని మరికొంతమంది కామెంట్లను చేస్తున్నారు.. ఇక మరి కొంతమంది అయితే "సమ్మర్ కావడం వల్ల పాము ఏకంగా చల్లదనం కోసం ఫ్రిజ్లో కూర్చుందని" కామెంట్లు చేస్తున్నారు..

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News