Venomous King Cobra And Pig Video Watch Now: భారత్‌లోనే అత్యంత ప్రమాదకరమైన పాముల్లో రాజనాగులు ఒకటి.. ఇవి ఎంతో ప్రమాదకరమైనగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీటి విషం అన్ని పాముల్లా కాకుండా చాలా ప్రమాదకరమైందిగా భావిస్తారు. ఒక్కసారి కాటేస్తే.. ఏకంగా నాడీ వ్యవస్థ దెబ్బతిని మనిషి మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే జంతువులపై దాడి చేసి కాటేస్తే క్షణాల్లోనే.. అవి చనిపోయే ఛాన్స్ కూడా ఉందని వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉంటారు. ఈ పాములు చూడడానికి చాలా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఆగ్రహం వెళ్లగక్కుతూ.. పడగలను విప్పుతూ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవి ఎక్కువగా అడవి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ పాములు జనావాసాల్లో కూడా సంచారం చేస్తాయి.
తాజాగా ఓ రాజనాగు పాముకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన నాకు పాము వద్దే ఓ పంది కదలడం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను వెనోమ్‌ఐ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను కింగ్ కోబ్రా రూల్స్ ది జంగిల్ అనే టైటిల్ పెట్టి షేర్ చేశారు. ఈ వీడియోలో రాజనాగు రూపం చూస్తేనే.. భయమేస్తున్నట్లు అనిపించడం మీరు గమనించవచ్చు. ఏది ఏమైనా జనాలు ఇలాంటి వీడియోలను చూసి ఎందుకే ఆసక్తి చూపుతున్నారు..
వీడియో వివరాల్లోకి వెళ్తే.. అత్యంత ప్రమాదకరమైన రాజనాగు ముందుకు కదులుతూ కనిపించడం మీరు చూడొచ్చు. ఇదే సమయంలో దానికి వ్యతిరేక దిశలో ఒక పంది నడుచుకుంటూ రావడం మీరు చూడొచ్చు. ఆ పంది చూడడానికి పిల్లలా కనిపిస్తోంది. అయితే, ఈ వీడియోలో రెండు ఒకదానికొక్కడికి దగ్గరగా వచ్చి.. వేటి దారి వెంట అవి వెళ్లిపోవడం మీరు చూడొచ్చు. ఈ వీడియోను ఓ దట్టమైన అడవిలో తీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పాముకు చాలా దగ్గరగా ఉండి ఈ వీడియోని చిత్రీకరించినట్లు కూడా సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన నాగుపాములకు దగ్గరగా వెళ్లే సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Giant Rock Python Video: ఆవుల పాకలో 9 అడుగుల రాక్ పైథాన్ కలకలం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
సాధారణంగా రాజనాగులకు కనిపించిన ఏ జంతువును వదలకుండా వాటి దగ్గర నుంచి వెళ్లిపోవు.. అయితే, ఈ వీడియోలో మాత్రం ఆ పాము పంది చాలా దగ్గర దాకా వచ్చినప్పటికీ దానిపై దాడి చేయలేకపోయింది.. అంతేకాకుండా ఆ పందికి దూరంగా పాము వెళ్ళినట్లు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే.. ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియోగా భావించవచ్చు. అలాగే కొంతమంది ఈ వీడియో చూసినవారు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది నిజమైన వీడియో కాదని Ai సృష్టించిందని వారు కామెంట్లలో రాసుకొస్తున్నారు.
Also Read: Giant Rock Python Video: ఆవుల పాకలో 9 అడుగుల రాక్ పైథాన్ కలకలం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









