King Cobra Around Lamb Neck Video Watch: సాధారణంగా పాములు ఎక్కువగా దట్టమైన అడవి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి జనాలకు చాలా దూరంగా నివాసిస్తూ ఉంటాయి. అయితే, ఆహారంతో పాటు ఆశ్రయం కోసం కొన్ని పాములు గ్రమాల్లోకి వచ్చి ఇళ్లలో చొరబడుతున్నాయి. ఇలా ఎవరు లేని సమాయాల్లో ఇళ్లలోకి దూరి మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇలా చాలా వరకు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న సమయంలో కొంతమంది స్నేక్ క్యాచర్స్ వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అయితే, తాజాగా కూడా సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో ఏంటో? దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Snake Catcher అనే య్యూటుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో గొర్రెల మందలోకి దూరిన పాము.. ఓ గొర్రె పిల్ల మెడ భాగం చుట్టు చుట్టేసుకుంది. అయితే, దీనిని ముందుగానే గమనించిన గొర్రెల కాపరి.. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. అయితే, దీనిని తెలుసుకుని వారు కూడా వెంటనే అక్కడి చేరుకున్నారు. అప్పటి వరకు ఈ ఆ కింగ్ కోబ్రా పాము గొర్రె పిల్ల మెడకే చుట్టుకుని ఉంది.
స్నేక్ క్యాచర్ పాములు పట్టే హుక్‌తో నెమ్మదిగా గొర్రె పిల్ల మెడలో ఉన్న పామును తీసేందుకు ప్రయత్నించాడు. ఆ పామును స్నేక్ క్యాచర్ ఎంతో నెమ్మదిగా గొర్రె పిల్లపై ఎలాంటి దాడి చెయ్యకుండా.. స్నేక్ స్టిక్‌తో పాటు పైపుతో ఎంతో నెమ్మదిగా.. ఆ పామును గొర్రె పిల్ల మెడలో నుంచి తీసే ప్రయత్నం చేశాడు. ఇలా కొద్ది సేపటి తర్వాత గొర్రె పిల్ల మెడలో నుంచి ఆ పామును తొలగించారు. ఈ సమయంలో పాము కూడా గొర్రెపై ఎలాంటి దాడి చెయ్యలేకపోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను Snake Catcher అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. దీనికి Galy men nag అనే క్యాప్షన్ పెట్టి సోషల్ వీడియాలో వదిలారు. ఈ పట్టుకున్న పామున స్నేక్ క్యాచర్ అడవిలో విడిచి పెట్టిన్నట్లు తెలుస్తోంది. ఇలా వైరల్ అవుతున్న వీడియోను చాలా మంచి వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన వారు కామెంట్లు కూడా చేస్తున్నారు.
Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









