)
Venomous King Cobra In Bathroom Viral Video: ప్రమాదకరమైన పాములను రక్షిస్తున్న వీడియోలను ఎప్పటికప్పుడు ముర్లీవాలే హౌస్లా షేర్ చేస్తూ వస్తుంది. ఈ ఛానల్ కు సంబంధించిన అనేక వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ఉంటాయి. ముఖ్యంగా ముర్లీవాలే పోస్ట్ చేసే వీడియోలైతే చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ ఛానల్ నుంచి గతంలో పోస్ట్ చేసిన చాలా వీడియోలు విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఓ వీడియో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని అజమ్గఢ్ జిల్లా, అసనియా గ్రామంలో టాయిలెట్ పైపుల్లో దూరిన అత్యంత ప్రమాదకరమైన నాగుపామును రక్షిస్తున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. ముఖ్యంగా పాములు పైపు లోపల నుంచి ఎంతో చాకచక్యంగా రక్షించిన ఘటనను చూసిన చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగు రోజుల నుంచి ఓ అత్యంత ప్రమాదకరమైన నాగుపాము అక్కడక్కడే తిరగడం ప్రారంభించింది..కొత్తగా నిర్మిస్తున్న వాష్‌రూమ్స్ లో దూరడంతో కొంతమంది దీనిని గమనించి వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు.
దీంతో వెంటనే ముర్లీవాలే హౌస్లా బృందం అక్కడికి చేరుకొని.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ముందుగా స్నేక్ క్యాచర్ వాష్ రూమ్ పైపుల్లో అటు ఇటు వెతుకుతూ ఉన్నాడు. ఇదే సమయంలో అతడికి ఆ పైపుల్లో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కనిపిస్తుంది. రెస్క్యూ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా దానిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటి వరకు వారు ఎంతగానో శ్రమించి.. దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి వారు ఆ బాత్రూంలో అత్యంత ప్రమాదకరమైన నాగుపామును పట్టుకొని బంధించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోకు కామెంట్లతో పాటు లైకులు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook