)
Venomous King Cobra Biting On Nose Rare Latest Video: ప్రస్తుతం చాలామంది పాములతో చేయకూడని పనులు చేస్తున్నారు. దీనివల్ల జీవితంలో కోలుకొని సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి కూడా ఇదే పని చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది. సాధారణంగా పాములు పట్టే స్నేక్ క్యాచర్స్ నిత్యం ఎన్నో పాములను పట్టుకుంటారు. ఇలా పట్టుకున్న పాములను కొంతమంది అడవి ప్రాంతాల్లో వదిలేస్తారు. మరి కొంతమంది వాటితో ఆటలాడుతూ ఉంటారు. ఇలా ఆటలాడే వారే ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా పట్టుకున్న పాములు ముద్దు పెట్టుకోబోయాడు.. అది చేసిన పనికి షాక్ అయిపోయి అక్కడే పామును వదిలిపెట్టాడు.
పాముల్లో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా.. అలాంటి పాముతో ఆటలాడుకోవడం అంత మంచిది కాదు. ముఖ్యంగా పట్టుకొని ముద్దులు పెట్టుకోవడం మరీ డేంజర్.. అయితే ఇదంతా తెలిసినప్పటికీ ఓ యువకుడు పామును ముద్దు పెట్టుకోబోయాడు. ఆ పాము కు వచ్చిన కోపంతో అతని మూతి పై కాటేసింది. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పట్టుకొని ఉండడం చూడొచ్చు..
కింగ్ కోబ్రా ని పట్టుకుని ఉన్న యువకుడు.. పాముని తన రెండు చేతులతో ముద్దు పెట్టడానికి తన మూతి దగ్గరికి తీసుకొని రావడం మీరు గమనించవచ్చు. ఆ యువకుడు చాలా నెమ్మది నెమ్మదిగా పామును తన మూతి దగ్గరికి తీసుకు వచ్చాడు. అలాగే ఆ పాము కూడా అంతగా రియాక్ట్ కాలేక పోయింది.. కానీ ఆ యువకుడు ముద్దు పెట్టే సమయానికే యమ స్పీడులో ఆ యువకుడి మూతిపై కాటు వేయడం చూడొచ్చు. దీంతో చేసేదేమీ లేక ఆ యువకుడు పామును అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
సాధారణంగా కింగ్ కోబ్రాలను పట్టుకునే సమయంలోనే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న స్నేక్ క్యాచర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఈ యువకుడు ఏమాత్రం భయం లేకుండా పాముకే ముద్దు పెట్టాలని చూసాడు. కానీ ఇది బెడిసి కొట్టింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సర్పమిత్ర సాయిదాస్ కుశాల్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షార్ట్ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 500 మంది కంటే ఎక్కువగానే లైక్ చేశారు. అంతేకాకుండా కొంతమంది కామెంట్లు కూడా చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి