King Cobra Video Watch Now: తాజాగా సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాకు వైద్యం చేస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. ఈ వీడియోలో ఇద్దరు వైద్యులు గాయపడిన అత్యంత విషపూరితమైన నాగుపాముకు చికిత్స చేయడం మీరు చూడొచ్చు. నిజానికి ఇలాంటి ప్రమాదకరమైన పాములకు చికిత్స చేయడం అంత సులభం కాదు. అలాంటిది ఈ వీడియోలో ఇద్దరు డాక్టర్లు పాముకు చికిత్స చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియోగా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ వీడియో ఎంతవరకు నిజమో? ఈ వీడియోలో ఏముందో? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం జనావాసాల నుంచి కొన్ని పాములు ఊళ్ళలోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన పాములైతే ఎక్కువగా జనాలు ఉండే ఇళ్లలోకి సంచారం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే చాలామంది వాటిని గాయాలకు గురిచేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటిలోకి సంచారం చేయబోతున్న అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాపై నుంచి తెలియని వాహనం వెళ్ళింది. దీంతో అది తీవ్రంగా గాయపడింది. అయితే, దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించి.. వైద్య నిమిత్తం కోసం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.
అక్కడున్న వైద్యులు మొదటగా పామును పరీక్షించారు. చాలా ప్రమాదకరమైన ఈ పామును గాయపడడంతో అటు ఇటు కదల లేకుండా పోయింది. అంతేకాకుండా కదులు లేని నిస్సహాయ స్థితిలో ఉండడంతో వైద్యులు కూడా వైద్యం చేసేందుకు ముందుకు వచ్చారు. ముందుగా పాముకి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత గాయపడిన చోటుని బాగా క్లీన్ చేసి.. ప్రత్యేకమైన లోషన్ పూసి.. కట్టు కట్టారు. వైట్ బ్యాండేజ్‌తో మాము మొత్తాన్ని చుట్టేసి.. పూర్తిగా గాయం బయటికి కనిపించకుండా కట్టు కట్టేశారు.
కట్టు కట్టిన పామును కొద్దిసేపు అక్కడే ఉంచి.. దానికి ఆహారాన్ని అందించి, కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి.. సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేశారు. సాధారణంగా పాములను పట్టుకోవడం ప్రమాదకరమైనప్పటికీ.. వాటిని రక్షించడంలో స్నేక్ క్యాచర్స్ ఎంతగానో ముందుంటున్నారు. అంతేకాకుండా చాలామంది గాయపడిన పాములను రక్షించడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పాముకు వైద్యం చేసిన ఈ వీడియోను అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









