Huge King Cobra Video: వామ్మో.. వాషింగ్ మెషన్‌లో బయటపడ్డ భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే భయపడడం పక్క..

Huge King Cobra In Washing Machine Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్ కోబ్రా పాముకు సంబంధించిన వీడియో ఎంతగానో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పాము వాషింగ్ మెషన్‌లో దూరి ఉండడం మీరు చూడవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 1, 2025, 02:24 PM IST
Huge King Cobra Video: వామ్మో.. వాషింగ్ మెషన్‌లో బయటపడ్డ భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే భయపడడం పక్క..

Huge King Cobra In Washing Machine Video Watch Here: సాధారణంగా నాగుపాములు ఎంతో విషపూరితమైనదని అందరికీ తెలిసిందే. ఇవి ఒక్కసారి దాడి చేస్తే.. నాడీ వ్యవస్థపై ప్రత్యేకమైన ప్రభావం పడి మరణం సంభవించవచ్చని కొంతమంది నిపుణులు చెబుతూ ఉంటారు. నిజానికి అడవుల్లో నీటి సాంద్రత ఒక్కసారిగా తగ్గిపోయి ఆహారానికి సంబంధించిన కోరత ఏర్పడుతోంది. ఈ కోరత వల్ల  అతి విషపూరితమైన జాతులకు సంబంధించిన పాములు కూడా ఊళ్ళల్లోకి ఇళ్లల్లోకి సంచారం చేస్తున్నాయి. కొన్ని పాములైతే నేరుగా ఇళ్లలోకి చొరబడి దాడి చేస్తూ ఉన్నాయి. వీటికి ఆటో బారిన పడి మరణించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా చాలామంది పాములు చూసిన వెంటనే స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందిస్తారు. వారు వీటిని పట్టుకొని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా  ఇంటర్నెట్లో వైరల్‌గా మారుతున్నాయి.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం కింగ్ కోబ్రా ఓ ఇంట్లో చొరబడి దూరకూడని చోట దూరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఓ భారీ కింగ్ కోబ్రా ఏకంగా బట్టలు శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ లో కనిపించింది. అయితే ఆ యజమానులు దీనిని చూసి షాక్ అయ్యారు. కొద్దిసేపటి వరకు వారికి ఏమీ అర్థం కాలేదు. అంతేకాకుండా వారు దానిని బొమ్మ పాము అనుకున్నారు. అదొక అరుదైన జాతికి సంబంధించిన నల్ల నాగుపాము అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. వార అక్కడికి చేరుకొని రెస్క్యూని చేపట్టారు. 

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలోని ఈ సంఘటన జరిగింది. అయితే స్నేక్ క్యాచర్స్ ఈ పాములు పట్టుకునే క్రమంలో అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ పాము చూడడానికి ఎంతో చిన్నదిగా ఉన్నప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉండడంతో వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే వారు ఏ మాత్రం భయపడకుండా పామును వాషింగ్ మెషిన్‌లో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ పామును వాషింగ్ మెషిన్‌లో నుంచి బయటికి తీసి.. ఒక సంచిలో బంధించారు. ప్రస్తుతం ఈ షాపింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ పామును చూసి కుటుంబ సభ్యులు ముందుగా ఎంతగానో భయపడ్డారు. అయితే ఈ వీడియోను చూసిన వారంతా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాషింగ్ మిషన్లో పాము పాము దూరడానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News