Cobra Video Watch: డ్రైనేజీలో నుంచి.. బలవంతంగా కింగ్ కోబ్రాన్ని బయటకు తీశారు.. వీడియో ఇదే..

King Cobra Video Watch Now: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి డ్రైనేజీ నుంచి అత్యంత ప్రమాదకరమైన కింగు కోబ్రాని బయటికి తీస్తున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ వీడియోని ఎక్కడ తీశారో తెలియదు కానీ.. చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 10, 2025, 01:46 PM IST
Cobra Video Watch: డ్రైనేజీలో నుంచి.. బలవంతంగా కింగ్ కోబ్రాన్ని బయటకు తీశారు.. వీడియో ఇదే..

King Cobra Video Watch Here: ప్రస్తుతం కింగ్ కోబ్రాలు కొన్ని ప్రాంతాల్లో అనుకోకుండా సంచారం చేసి  మనుషులపై దాడి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అడవుల్లో వనరుల కోరత విపరీతంగా తగ్గడం కారణంగా.. ఊహించని స్థాయిలో అక్కడ జీవించే కొన్ని వన్యప్రాణులు జనావాసాల మధ్యకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రకాల పాములు కూడా జనావాసాల మధ్యకు వచ్చి ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇలాగే వచ్చిన ఓ పాము స్థానికులకు కళ్లకు చిక్కింది. దీంతో వారి స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించడంతో వార అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

గత కొద్ది రోజుల నుంచి వైజాగ్ నగరంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా అదేపనిగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నగరానికి దగ్గరగా ఉన్న అడవుల నుంచి చిన్నచిన్న పాములు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే ఓ ఇంటి డ్రైనేజీలోకి అత్యంత ప్రమాదకరమైన నాగుపాము సంచారం చేసింది. దీనిని ఆ ఇంటి యజమానులు గమనించి వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. వారి బృందం అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 

వీడియోలో భాగంగా స్నేక్ క్యాచర్ కిరణ్ ముందుగా ఆ కింగ్ కోబ్రా చేరిన డ్రైనేజీ దగ్గరికి చేరుకున్నాడు. అతనికి అందులో ఆ పాము తోక భాగం కనిపించడంతో.. వెంటనే దానిని పట్టుకున్నాడు. ఆ పాము తోక భాగం పట్టుకొని అందులో నుంచి పైకి లాగేసాడు. ఇలా లాగిన వెంటనే ఆ పాము కూడా పూర్తిగా డ్రైనేజీ నుంచి బయటికి వచ్చింది. కొద్దిసేపు ఆ పాము ఊపిరి లేనట్టే కనిపించింది. కానీ చివరికి కదలడం ప్రారంభించింది. 

Also ReadKing Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

అత్యంత ప్రమాదకరమైన ఆ పాము అటు ఇటు కదలడంతో చూసి అక్కడున్న స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా తోక పట్టుకున్న కిరణ్‌ను దాడి చేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే, అతడు తనకున్న నైపుణ్యంతో దాని నుంచి తప్పించుకున్నాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలే నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చాలామంది దీనిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Also ReadKing Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News