Venomous King Cobra Video: ఎన్నో రకాల ప్రమాదకరమైన పాములు అడవులను వదిలి.. ఎక్కువగా జనావాసాల్లో తిరుగుతున్నాయి. అంతేకాకుండా ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. చాలామంది ఇలా ప్రత్యక్షమైన పాములను చూసి భయపడుతున్నారు. కొంతమంది తెలిసి తెలియక వాటిని తాకడం వల్ల గాయాల పాలవుతున్నారు. పాములు చాలా ప్రమాదకరమైన మని తెలిసినప్పటికీ కొంతమంది వాటితో చెలగాటమాడుతున్నారు. ఏది ఏమైనా పాములతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చాలామంది పిల్లలు ఇలా పాములు సంచారం చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లోని కిచెన్‌లో అతి ప్రమాదకరమైన పాము ప్రత్యక్షమైంది.. ఆ ఇంటి కుటుంబ సభ్యులంతా పరుగులు పెట్టేసారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
సాధారణంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అడవుల్లో పూర్తిగా ఆహార కొరత ఏర్పడింది.. దీని కారణంగా మూగజీవులు, సరీసృపాలు జనాభాసాల్లోకి భారీ మొత్తంలో సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అడవి ప్రాంతానికి దగ్గరగా ఉండే ఊళ్ళలో ఎక్కువగా జంతువులు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఓ అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఊరిలోని ఇంట్లో ప్రమాదకరమైన నాగుపాము ప్రత్యక్షమైంది. అయితే ఈ పాము ఏకంగా కిచెన్ లో దర్శనమివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కిచెన్ లో వంట సామాన్ల కింద ఈ పాము ఎప్పుడు నొక్కిందో తెలియదు.. కానీ ఇంట్లోని ఒకరు చూసేదాకా బయటపడలేదు. అయితే పాము ఉందని గమనించిన ఇంట్లో వారు నేరుగా స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు.
వెంటనే స్నేక్ క్యాచర్ ఆ ఇంటికి చేరుకొని పాములు వెతికేందుకు ప్రయత్నించాడు. అయితే వంట పాత్రల కింద ఉండడంతో దానిని గమనించిన పాములు పట్టే అతడు చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ పాము ఎందుకు ప్రమాదకరమైంది కావడంతోపాటు ఎంతో చురుకుగా ఉండడం వల్ల తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించింది. పాములు పట్టే యువకుడు దాదాపు పది నిమిషాల పాటు ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. చివరకు ఆ పాము అతడికి దొరికిపోయింది. అయితే ఈ పామును ఓ సురక్షితమైన డబ్బాలో భద్రపరిచి అడవి ప్రదేశంలో వదిలారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. వంటగదిలో కూడా పాములు దూరుతాయని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









