)
Nallatrachu Vs Mongoose Video Watch Now: నిత్యం ప్రకృతిలో భాగంగా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ ప్రకృతి అద్భుతాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి జనాలని ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా కూడా ఇలాంటి వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ నల్లత్రాచు ముంగిస మధ్య భీకరమైన పోరాటం ఘటన చూడొచ్చు. జనాలు ఎక్కువగా ఇలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇక ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. నల్లత్రాచు పాము పడక విప్పి ముంగిసను బెదిరించడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అయితే ఇదే క్రమంలో పాము దాడి నుంచి తప్పించుకోవడానికి ముంగిస మెరుపు వేగంతో అటు ఇటు గెంతడం కూడా గమనించవచ్చు. నల్లత్రాచు పాము కాటును అంచనా వేస్తూ ముంగిస దాని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి.. అలాగే దాని వైపు చూస్తుండి పోయింది. ఈ సమయంలో పాము కూడా అరుదైన శబ్దాన్ని చేస్తూ ఆ చిన్న ముంగిసను భయపెట్టే ప్రయత్నం చేసింది..
పాము నుంచి వస్తున్న శబ్దానికి ముంగిస ఏమాత్రం బెదరలేదు.. అలాగే పాము ముందుండి దాని దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం మీరు వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. చివరిగా ఆ నల్ల త్రాచుపాము ముంగిసపై దాడి చేయబోతుంది. అయితే, దీనిని గమనించిన ముంగిస వెంటనే ఆ పాము దాడి నుంచి తప్పించుకుంటుంది. తప్పించుకొని ఎంతో చాకచక్యంగా పాము వెనకాలోకి జంపు చేస్తుంది. ఇదంతా రెప్పపాటి కాలంలో జరిగిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
సాధారణంగా పాములు ముంగిసలు ఒకదానికొకటి బద్ధ శత్రువులు. అందుకే పాములకు ముంగిసలు ఎదురుపడ్డప్పుడు తప్పకుండా వాటిపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ దాడిలో భాగంగానే అప్పుడప్పుడు పాములు విజయం సాధిస్తాయి. అయితే, ఈ వీడియో సగంలోనే ముగిసిపోవడంతో.. ఈ పోరాటంలో ఏది గెలిచిందనేది క్లారిటీ రాలేదు. ఇప్పటికీ ఈ వీడియోను కొన్ని వందల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోను లైక్ కూడా చేశారు. ఇక ఇది చూసిన ఆశ్చర్యపోయిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా పెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook