Python Snake Attack Video Watch: కొండ చిలువల గుడ్లను పట్టుకునందుకు ఏం చేసిందో చూడండి.. షాక్‌ అవుతారు!

Python Snake Attack Video Viral Watch: తాజాగా కొండ చిలువల గుడ్లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 10, 2025, 08:43 AM IST
Python Snake Attack Video Watch: కొండ చిలువల గుడ్లను పట్టుకునందుకు ఏం చేసిందో చూడండి.. షాక్‌ అవుతారు!

Python Snake Attack Video Viral Watch Here: అత్యంత ప్రమాదకరమైన పెద్ద పాముల్లో కొండ చిలువలు ఒకటి.. ఈ జాతికి సంబంధించిన పాములు భారత్‌లో చాలా అరుదుగా కపిపిస్తు ఉంటాయి. ఇవి వివిధ కలర్స్‌లో ఉంటాయి. కొండ చిలువ జాతులకు సంబంధించిన కొన్ని పాములు 30 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. అయితే ఇవి అంతగా విషపూరితమైనవి కాకపోయిన చాలా ప్రమాదకరం.. వీటికి ఉన్న బలమైన కండరాలను వినియోగించి జంతువులపై దాడి చేసి ఆహారంగా మలుచుకుంటాయి. ఇవి ఎక్కువగా ఎలుకలు, పక్షులు, ఇతర జంతువపై దాడి చేసి చంపుకుని తింటాయి. అలాగే కొంత పెద్ద పాములైతే జింకలు, బర్రెలు, అడవి పందులను కూడా తింటూ ఉంటాయి.

Add Zee News as a Preferred Source

కొండ చిలువలు సాధారణంగా ఆసియాతో పాటు ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లోని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి చెట్లపై ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతాయని సమాచారం. వీటిలో కొన్ని పాములు వర్షారణ్యాలు, గడ్డి భూములు, చిత్తడి నేలల్లో ఎక్కువగా ఉండేదుకు ఆసక్తి చూపుతాయి. కొండ చిలువలు అన్ని పాముల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఎంతో స్పీడ్‌గా చెట్లపైకి ఎక్కగలుగుతాయి.

అలాగే కొన్ని కొండ చిలువలు నీటిలో కూడా బాగా ఈదుతాయి. ఇవి ఉదయంతో పోలిస్తే ఎక్కువగా రాత్రి వేళల్లో చురుకుగా ఉంటాయని సమాచారం.. ఆడ కింగ్‌ కోబ్రాలు చాలా శక్తివంతమైనగా చెప్పవచ్చు. ఇవి ఒకేసారి దాదాపు 100 గుడ్ల వరకు పెట్టగలుగుతాయి. అంతేకాకుండా గుడ్లపై పొదిగి పిల్లలు చేసి వాటికి రక్షణగా నిలుస్తాయి. అన్ని పాముల పిల్లలతో పోలిస్తే, ఈ పిల్లల పరిమాణం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇవి పెరిగి పెద్దైన తర్వాత తల్లి కొండ చిలువలు పిల్లల దగ్గరి నుంచి వెల్లిపోతాయి. అయితే ఈ పాములు గుడ్లు పెట్టే క్రమంలో వాటిని రక్షించుకునేందుకు అనేక జాగ్రత్తలు పడతాయి. తాజాగా ఈ కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ కొండ చిలువ తను గుడ్లను ముట్టుకున్నందుకు దాడి చేయడం మీరు చూడొచ్చు. తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోలో ఈ ఓ వ్యక్తి తను పెంచుకుంటున్న కొండ చిలువ పెట్టిన గుడ్లను ముట్టుకుంటాడు. అయితే దీనిని గమనించిన ఈ పాము పెంచుకుంటున్న యజమానిపైనే దాడి చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. దీనిని @JayPrehistoricPetsTV అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను ఏడు లక్షల మందికిపైగా లైక్‌ చేశారు. అంతేకాకుండా కొంత మంది కామెంట్స్‌ కూడా చేస్తున్నారు.  

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News