)
Venomous Python Video Watch: భారతదేశంలోని ఓ గ్రామంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ అత్యంత ప్రమాదకరమైన భారీ పాము కోడిని అమాంతం మింగేస్తూ స్థానికులకు కనిపించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. సాధారణంగా అడవికి దగ్గరగా జీవించే చాలా ఊళ్ళలోకి అత్యంత ప్రమాదకరమైన పాములు వస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న పాము కూడా ఇలా సంచారం చేసి కోడిని పట్టుకొని అమాంతం మింగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్థానిక గ్రామస్తుల అందించిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఓ ఇంటి యజమానికి సంబంధించిన కోళ్ల ఫారం దగ్గర చోటుచేసుకుంది. వీడియో ప్రారంభంలో.. ఓ చిన్న కొండచిలువ పాము పామును తన నోటి భాగం నుంచి అమాంతం మింగడం మీరు గమనించవచ్చు. దీంతో ఆ పాము పెద్దగా ఉబ్బినట్లు కూడా కనిపిస్తుంది. అయితే ఈ పాములు వాటి శరీరం కంటే ఎక్కువ సైజులో ఉండే జంతువులను కూడా ఎంతో సులభంగా మింగుతాయి..
ఆ పాము మింగుతున్న సమయంలో పొట్టలో ఏదో సమస్య రావడంతో.. మళ్లీ ఆ కోడిని తన నోటి ద్వారా బయటికి కక్కడం కూడా మీరు గమనించవచ్చు. ఇలా అప్పుడప్పుడు కొన్ని పాములు అవి తీసుకున్న ఆహారం జీర్ణం కావని తెలుసుకొని ఇలా చేస్తూ ఉంటాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆ అత్యంత ప్రమాదకరమైన కొండచిలువ పాము తను మింగిన కోడి జీర్ణం కాదని తెలుసుకొని బయటికి నోటి ద్వారానే తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
36 సెకండ్ల నిడివి గల వీడియో ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు ఇప్పటివరకు ఈ వీడియోను 12,000 మందికి పైగా లైక్ చేశారు. కొంతమందైతే ఈ వీడియోలో కనిపిస్తున్న పాము రక్తపింజర పాము కాదని కొండచిలువని చెబుతున్నారు. ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ పాము కొండచిలువని.. దీనికి విషం ఉండదని కామెంట్లలో రాసుకు వస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములకు చాలా దూరంగా ఉండటం మంచిదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి