Golden King Cobra Viral Video: తన పిల్లను తాను చంపితిన్న గోల్డెన్ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మీరు ధైర్యవంతులే..

Golden King Cobra Viral Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో గోల్డెన్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పాము తన పిల్లను తాను చంపుకొని తినడం మీరు గమనించవచ్చు. వీడియో మీరు కూడా ఇప్పుడే చూడాలనుకుంటున్నారా?

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 10, 2025, 08:37 AM IST
Golden King Cobra Viral Video: తన పిల్లను తాను చంపితిన్న గోల్డెన్ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మీరు ధైర్యవంతులే..

 Golden King Cobra Viral Video Watch Here: సాధారణంగా కింగ్కోబ్రాలు అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటి. ఈ కింగ్ కోబ్రా జాతుల్లో వివిధ రకాల పాములు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రంగుతో ప్రత్యేకమైన రూపాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా కొన్ని  కింగ్ కోబ్రాలు గోధుమ రంగును కలిగి ఉంటే మరికొన్ని నలుపు రంగులో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని అయితే తెలుపు రంగులో కూడా ఉంటాయి. కానీ ఇందులోనే గోల్డెన్ రంగుతో కూడిన కింగ్ కోబ్రాలు కూడా ఉంటాయి. ఈ పాములు అన్నింటికంటే చాలా డేంజర్.. చూడడానికి గోల్డెన్ రంగులో ఉన్నప్పటికీ దీని కాటు ప్రమాదకరం.. సాధారణంగా ఈ పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా అమెజాన్ అడవులకు సంబంధించిన పరిసరాల ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటాయట. అయితే గోల్డెన్ కలర్ లో ఉండే ఈ పాములు ఎంతో పవర్ఫుల్ విషయాన్ని కలిగి ఉంటాయి. దీని కాటుతో పెద్దపెద్ద ఏనుగులు మరణించే ఛాన్స్ కూడా ఉందట.  

Add Zee News as a Preferred Source

ఇలాంటి కలర్ తో కూడిన కింగ్ కోబ్రాలు ఎక్కువగా ఇసుక ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఎంతో ప్రమాదకరమైన ఈ కింగ్ కోబ్రాలు రెండు నుంచి మూడు మీటర్ల పొడవు ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన తలభాగాన్ని కలిగి ఉంటాయట.. అలాగే ఇతర నాకు పాముల వలె పై తల భాగంలో రెండు చారాలు కూడా ఉంటాయి. ఇవి మాంసాహారులు.. కాబట్టి ఆహారం కోసం ఇతర జంతువుల పై దాడి చేయడం ఇతర పాములను చంపుకొని తినడం వంటివి చేస్తాయి. ఈ పాము ఒక్కసారి దాడి చేస్తే జంతువు మరణించేదాకా వదిలిపెట్టదట.. అంతేకాకుండా దూరం నుంచి జంతువులను పసిగట్టే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుందట. 

మామూలుగా ఈ గోల్డెన్ కింగ్ కోబ్రాలు ఎక్కువగా తమ తోటి పాములను కూడా చంపుకొని తింటాయట. అంతేకాకుండా వాటిపై అతి క్రూరంగా దాడి చేసి గాయపరుస్తాయట.. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఓ గోల్డెన్ కింగ్ కోబ్రా వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కోబ్రా తన పిల్లను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా ఆహారంగా చేసుకుని తినడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడియో వివరాల్లోకి వెళితే ఓ గోల్డెన్ కింగ్ కోబ్రా తన తోటి పామును నమిలి తినడం మీరు చూడవచ్చు. అంతేకాకుండా పాము తల భాగాన్ని మొత్తం నమిలి తిని చివరకు తోక భాగం ఉండడం కూడా మీరు చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజెన్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోను @మనీరాల్కుహరి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ గోల్డెన్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News