Cobra VS Scorpion Video: క్యారే.. దెబ్బ అదుర్స్ కదా..!.. తేలు ఇచ్చిన షాక్‌కు విల విల్లాడి పోయిన పాము.. నెట్టింట వైరల్గా మారిన వీడియో..

Cobra Snake Video: పాము చాలా ఆకలితో వేట కోసం వెళ్తుంది. ఇంతలో దాని ముందు ఒక తేలు కన్పించింది. మరీ దాన్ని తిని తన ఆకలి తీర్చుకొవాలని ప్లాన్ చేసింది. ఇంకే ముంది.. తేలుపై అమాంతం దాడికి దిగి.. దాన్ని మింగేందుకు ప్రయత్నించింది. కానీ ఇంతలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 18, 2025, 03:16 PM IST
  • పాముపైన తేలు దాడి..
  • వీడియో వైరల్..
Cobra VS Scorpion Video: క్యారే.. దెబ్బ అదుర్స్ కదా..!.. తేలు ఇచ్చిన షాక్‌కు విల విల్లాడి పోయిన పాము.. నెట్టింట వైరల్గా మారిన వీడియో..

Venomous Snake and Scorpion Fighting Each other video: సాధారణంగా పాముల వీడియోలు ఇటీవల నెట్టింట తెగ ట్రెండింగ్ లో ఉంటున్నారు. కొన్ని వీడియోలను చూస్తే భయంకరంగాను, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిలా ఉంటున్నాయి. కానీ నెటిజన్లు మాత్రం ఏమాత్రం భయంలేకుండా స్నేక్ ల వీడియోలను చూస్తున్నారు. మరీ ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన కూడా కొంత మంది అదే పనిగా తమ ఫోన్ లలో రికార్డులు చేసి సోషల్ మీడియాలో ఆయా ఘటనలను వైరల్ చేస్తుంటారు.

Add Zee News as a Preferred Source

ఇక పాములు ఎక్కడైన కన్పిస్తే చాలు.. వెంటనే వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.ఈ క్రమంలో పాములకు కొన్ని జీవులు అంటే అస్సలు పడదు. ముఖ్యంగా.. ముంగీస, గద్ద, కుక్కలు వంటి జీవులకు పాములంటే అస్సలు పడదు. అయితే.. పాములు కూడా రాత్రి పూట ఎక్కువగా ఆహారం కోసం తమ పుట్టలో నుంచి బైటకు వెళ్తాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @rijeshkv_80

మరీ ఇక్కడ కూడా ఒక పాము ఆహారం కోసం బైటకు వెళ్లింది. మరీ దాని ముందు ఒక అడవిలో ఉండే ఎర్రటి తేలు ఎదురైంది. ఇంకే ముంది.. దాని మీద దాడి చేసి తినాలని ప్రయత్నించింది. పాము తేలుపైన దాడిచేసి.. దాని ముఖంలోని కొంత భాగంను మిగింది. కానీ తేలుమాత్రం పాము.. తన పదునైన వేళ్లతో పామును పట్టేసుకుంది . తోకతో దాన్ని కొడుతూ ఉంది. దీంతో పాముకు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది.

అటు పాము తేలును మింగలేక.. ఇటు విడ్పించుకోలేక విలవిల్లాడిపోయింది. మరోపక్క.. తేలు సైతం.. పాము తనకు బలం ఉందని రెచ్చిపోయినందుకు ఒకసారి ఝులక్ ఇచ్చి చూపిచ్చింది.

Read more: Viral Video: రోడ్డు మధ్యలో టీ తాగుతూ రీల్స్.. పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..  

ఆ తర్వాత ఏమైందో మాత్రం తెలీదు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బాబోయ్ అంటూ షాక్ కు గురౌతున్నారు. మరికొందరు మాత్రం ఇదేం ఫైటింగ్ రా భయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News