Viral Video: కుంభమేళలో అద్భుతం.. మహిళ పుణ్య స్నానం చేస్తుండగా వచ్చిన భారీ సర్పం.. వీడియో వైరల్..

Snake viral video: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఒక మహిళ పుణ్యస్నానం ఆచరిస్తుంది. ఇంతలో ఒక భారీ సర్పం ఆమె దగ్గరకు వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2025, 02:09 PM IST
  • కుంభమేళలో భారీ సర్పం..
  • ఆశీర్వాదం తీసుకున్న మహిళ
Viral Video: కుంభమేళలో అద్భుతం.. మహిళ పుణ్య స్నానం చేస్తుండగా వచ్చిన భారీ సర్పం.. వీడియో వైరల్..

Snake comes in womans feet while she was taking holy dip video: ప్రయాగ్ రాజ్ లో ఇటీవల జరిగిన కుంభమేళకు మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. ప్రపంచ దేశాల్లోని భక్తులు భారీగా తరలి వచ్చారు. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళ.. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ముగిసింది.ఈ క్రమంలో కుంభమేళకు వచ్చే భక్తులు సంఖ్య ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు కుంభమేళలో.. 70 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కారు ప్రకటించింది.

Add Zee News as a Preferred Source

ప్రతి రోజు కుంభమేళలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు సైతం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా ఆసక్తి చూపించారు. రైళ్లు,విమానాలు, బస్సులు,సొంత వాహానాల్లో భక్తులు కుంభమేళకు భారీగా తరలివచ్చారు. మొత్తంగా కుంభమేళ అంతా జనసంద్రంగా మారిందని చెప్పుకొవచ్చు. యోగి సర్కారు సైతం కుంభమేళకు వచ్చే భక్తులకు ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

 

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక మహిళ పుణ్యస్నానం ఆచరిస్తుండగా.. ఒక భారీ సర్పం ఆమె వద్దకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మహిళ కుంభమేళలో స్నానం చేస్తుంది. గంగా దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటుంది. ఈ క్రమంలో ఒక భారీ సర్పం ఆమె దగ్గరకు వచ్చింది. ఆ సర్పాన్ని చూసిన సదరు మహిళ ఏ మాత్రం భయపడలేదు.. తనను ఆశీర్వాదం ఇవ్వడానికి సర్పరాజ్ వచ్చాడని ఆనంద పడింది.

Read more: Viral Video: ఐఐటీ బాబాపై దాడి... టీవీ లైవ్ డిబెట్‌లో చావ బాదిన సాధులు.. వీడియో వైరల్...

మొత్తంగా ఆ పామును పట్టుకుని తన మెడలో వేసుకుంది. అక్కడున్న వారు మహిళను చూసి దూరంగా వెళ్లిపోయారు. మరికొందరు వీడియోలు తీసుకుంటూ అక్కడే నిలబడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు అది.. ఏదో రీల్స్ స్టంట్ అని కూడా కొట్టిపారేస్తున్నారు. మరికొందరు అది కాటు వేస్తే తెలుస్తది అంటూ కూడా మహిళపై సెటైర్ లు వేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News