Snake Crying Video Watch: పాపం నాగుపాము.. ప్రియుడు చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటోంది.. వీడియో ఇదే..

Snake Crying Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు పాములకు సంబంధించిన ఓ బాధాకరమైన వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన చాలామంది బాధపడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది యువత బాగోద్వేగానికి గురవుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 9, 2025, 10:02 AM IST
Snake Crying Video Watch: పాపం నాగుపాము.. ప్రియుడు చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటోంది.. వీడియో ఇదే..

 Venomous Snake Crying Video Viral: ప్రేమ మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటుంది. జీవితంలో అపురూపమైన ప్రేమను పాల్పంచుకోవడం ప్రతి ఒక్క జీవి అదృష్టంగా భావించవచ్చు. మనం గతంలో వైరల్ అయిన ఎన్నో జంతువులు, సంస్కృపాలకు సంబంధించిన ప్రేమ వీడియోలను చూసి ఉంటాం. గతంలో వైరల్ అయిన వీడియోలో రెండు జంట ఏనుగులు ఒక ఏనుగు మరణిస్తే, మరొక ఏనుగు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ పాము వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా బాగోద్వేగానికి గురవుతున్నారు. నిజానికి వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

వీడియో వివరాల్లోకి వెళితే, జెసిబితో కొంతమంది పొలాల్లో కాలువలు తవ్విస్తున్న సమయంలో అనుకోకుండా దాని టైర్ కింద పడి పాము మరణిస్తుంది. అయితే దీనిని గమనించిన మరోపాము మరణించిన పాము మృతదేహం ముందుకు వస్తుంది. అంతేకాకుండా చనిపోయి ఉన్న పామును చూస్తూ మరోపాము అలాగే ఉండిపోతుంది. అలాగే కొద్దిసేపు ఇలాగే బాధపడి ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాధారణంగా ఈ రెండు పాములను చూస్తుంటే వాటి మధ్య ఉన్న ప్రేమ అంతో ఇంతో కాదనిపిస్తుంది. ప్రమాదమశాత్తు ఆ పాము చనిపోవడంతో ఇప్పుడు ఏకాకిగా మరో పాము మారిపోయింది. దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 
 
 
 
 

సాధారణంగా ఈ వీడియో చూస్తే రెండు పాముల మధ్య ఉన్న ప్రేమ చాలా అపురూపమైందని అర్థమవుతుంది. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోను సల్మాన్_పఠాన్230 అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. ఈ వీడియోను చూసిన చాలామంది వీటి రెండిటి మధ్య ఉన్న ప్రేమ గురించి కామెంట్లలో మాట్లాడుకుంటున్నారు. కొంతమంది వీటి రెండిటి మధ్య తెగిపోయిన బంధం గురించి బాధపడుతూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది ప్రియుడు చనిపోయినందుకు ఈ నాగు పాము కన్నిళ్లు పెట్టుకుంటోందని కామెంట్లు రాస్తున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News