King Cobra Video: ఇదేం విచిత్రం సామి.. నల్ల నీళ్లు తాగుతున్న పాము.. వీడియో ఇదిగో చూడండి..

King Cobra Drinking Water Video: తాజాగా సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. పాము ఏకంగా నీరు వస్తున్న నల్ల పైకి ఎక్కి నీటిని తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడు చూడండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 11, 2025, 06:01 PM IST
King Cobra Video: ఇదేం విచిత్రం సామి.. నల్ల నీళ్లు తాగుతున్న పాము.. వీడియో ఇదిగో చూడండి..

 King Cobra Drinking Water Video: సాధారణంగా పాములు నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో జీవించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే సరస్సుల పక్కన చిట్టడినేళ్లతో కూడుకున్న నదుల్లో ఎక్కువగా పాములు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలోనైతే పాములు ఎక్కువగా చల్లగా నీరు అధికంగా ఉండే ప్రదేశాల్లో ఉండడం మీరు గమనించవచ్చు. అన్ని కాలాలతో పోలిస్తే ఎక్కువగా ఎండాకాలం పాములకు దాహం వేస్తూ ఉంటుంది. అందుకే ఈ సమయంలో పాములు కొన్ని ప్రదేశాలను ఎంచుకొని ప్రతిరోజు అక్కడికి వెళ్లి నీటిని తాగి సేద తీరుతూ ఉంటాయి. కొన్ని పాములైతే అడవి నుంచి తప్పిపోయి.. జనావాసాల్లోకి సంచారం చేసే సమయాల్లో మీరు ఎక్కడ కనబడితే అక్కడకెళ్లి తాగుతూ ఉంటున్నాయి. తాజాగా ఓ పాము  నల్ల నుంచి వస్తున్న నీటిని తాగుతూ కెమెరాకు చిక్కింది. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

Add Zee News as a Preferred Source

తాజాగా ఓ పాము కొళాయి నుంచి వస్తున్న నీటిని నేరుగా తాగుతూ తాగుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ భారీ నాగసర్పం ఏకంగా నీరు వస్తున్న నల్ల దగ్గరికి వెళ్లింది. అయితే దాహం వెయ్యడంతో పాము నల్ల చుట్టూ చుట్టుకుని కొద్దిసేపు దాని గుండా వస్తున్న నీరును తాగేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా ఇదే సమయంలో తలభాగాన్ని నీటితో శుభ్రం చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాము ఏకంగా ఒక నల్ల నుంచి వస్తున్న నీటిని తాగడంతో  ఈ వీడియోని చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. 

 
 
 
 
 

సాధారణంగా అన్ని పాములు మురికి నీటి కాలువలు, నీటి గుంతల్లో ఎక్కువగా వేసవి సమయాల్లో నీటిని తాగుతూ ఉంటాయి. అయితే ఈ పాము మాత్రం ఏకంగా నీరు వస్తున్న నల్ల దగ్గరికి వచ్చి నీటిని తాగేసింది.  ఈ అరుదైన దృశ్యాలు చూసేందుకు అక్కడికి చాలామంది పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతేకాకుండా కొంతమంది పాము చేస్తున్న వింత పనిని చూసి వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతున్న ఈ వీడియో బిహారీ లేక్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా చాలామంది దీనిని చూసి కామెంట్లు కూడా చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News