Venomous Snake In Ice Cream Video: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు, ఫొటోస్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలా సన్నివేశాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. తాజాగా ఇటీవలే ఐస్ క్రీమ్ కి సంబంధించిన ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. అది కూడా ఓ వ్యక్తి ఐస్క్రీం పట్టుకొని చూపిస్తున్న ఫొటోస్.. ఇంతకీ ఈ ఐస్ క్రీమ్ ఫోటో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి.? అని అనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్ లో ఓ వ్యక్తి ఎండలను తట్టుకోలేక చల్లగా ఐస్ క్రీం తినాలని తమ వీధిలో ఉన్న ఐస్ క్రీమ్ షాప్ లో ఓ పెద్ద బ్రాండ్ ఐస్ క్రీమ్ కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి ఐస్ క్రీమ్ పై ఉన్న ప్యాకెట్ను విప్పి.. సగం తిన్నాడు.. ఇంతలోనే ఆ వ్యక్తి ఐస్ క్రీమ్ లో ఏదో ఉందని గమనించి చూశాడు.. దీంతో ఆ వ్యక్తికి అనుకోని సంఘటన ఎదురయింది.
థాయిలాండ్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఐస్ క్రీమ్స్ బ్రాండ్స్ లో బ్లాక్ బీన్ ఐస్ క్రీం ఒకటి.. దీని విక్రయాలు ప్రతిరోజు కొన్ని లక్షల్లో ఉంటాయి. అయితే ఆ వ్యక్తి ఈ ఐస్ క్రీమ్ కొనుగోలు చేసి సగం తినేశాడు ఇంకా సగం తినే క్రమంలో అతనికి వింత సంఘటన ఎదురయింది లోపల గడ్డకట్టిన నలుపు రంగు తో కూడిన ఓ పాము తల స్పష్టంగా కనిపించింది దీంతో అతను దాన్ని మరీ పరీక్షించి చూసేందుకు ప్రయత్నించాడు. అయితే అది పాము తలా అని గమనించి వెంటనే ఫొటోస్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన సగం తిన్న ఐస్ క్రీమ్ లో "గోల్డెన్ ట్రీ స్నేక్" వచ్చిందని క్యాప్షన్ పెట్టి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోతో పాటు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ఆ బాధితుడు ఐస్ క్రీమ్ పై ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.
"గోల్డెన్ ట్రీ స్నేక్" అతి ప్రమాదకరమైన పాము కావడంతో ఆ బాధిత వ్యక్తి చాలాసేపు కంగారు పడ్డట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఘటనపై ఆయన ఘాటుగా స్పందించినట్లు సమాచారం. ఈ ఐస్ క్రీమ్ కు సంబంధించిన వైరల్ అవుతున్న ఫొటోస్ పై చాలా మంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమందికి ఈ పోస్ట్ ఆశ్చర్యం కలిగిస్తే మరికొంతమందికి హాస్యాస్పదంగా మారింది. స్ట్రీట్ ఫుడ్స్ తినే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ తినేవారు ఒకటికి రెండుసార్లు చూసి తినడం మంచిదని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదకరమైన స్నేక్ 70-130 సెం.మీ పొడవు ఉంటుందని.. ఐస్ క్రీమ్ లో మాత్రం 40 cm పొడవుతో వచ్చిందని సమాచారం. ఈ పాము ఒక్కసారి కాటేస్తే తప్పకుండా మనిషి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి ఎండాకాలం సమయంలో ఏవైనా బ్రాండ్లకు సంబంధించిన శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్ తినే సమయంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా తక్కువ రేటింగ్స్ కలిగిన బ్రాండ్లకు సంబంధించిన ఐస్ క్రీమ్స్ తినకపోవడం ఎంతో మంచిదని కొంతమంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా ఐస్ క్రీమ్స్ తినేవారు తప్పకుండా దీనిని దృష్టిలో పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









