Venomous snake hiding in shoes video: పాముల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్ లు సైతం పాముల వైరల్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అడవులు, చెరువులు, గుబురుగా చెట్లు ఉన్న చోట్ల పాములు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా పాములు.. పంటపోలాల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. ఎలుకలు ఉన్న చోట పాములు ఎక్కువగా ఉంటాయి.
ఇళ్లలో సజ్జల మీద, బట్టలలో, చాలాసార్లు షూస్ లలో పాములు దూరి దాక్కుంటాయి.వాహనాల్లో కూడా పాములు దూరి దాక్కుంటున్నాయి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తొంది. ఎండకు తాళలేక పాములు చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశాల్లో వెళ్లి దాక్కుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.దీనిలో పాము స్పీడ్ గా వచ్చి అక్కడే ఉన్న ఒక షూస్ లో దూరిపోయింది.
सावधान ?? जूते ध्यान से देख के पहने pic.twitter.com/4KbJEBiJwC
— @Madhu_queen (@madhu_quen) March 5, 2025
అక్కడే ఉన్న కొంత మంది షూస్ లో దూరిపోతున్న ఘటనను మెల్లగా తమ ఫోన్ లలో రికార్డు చేశాడు. దాదాపు.. 6 అడుగుల పాము వేగంగా వెళ్లిషూస్ లో దూరిపోయి ముడుచుకుని ఉండిపోయింది.
Read more: Viral Video: స్థాన బలం చూసి ఎగిరెగిరి పడిన మొసలి.. ఏనుగులన్ని కలిసి ఏంచేశాయంటే.. ?... వీడియో వైరల్..
వెంటనే ఇంట్లో వాళ్లు స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతని లక్ బాగుందని పామును గమనించారు. ఒక వేళ పామును గమనించకుంటే.. ఏంటీ పరిస్థితి అని నెటిజన్లు భయపడిపోతున్నారు. ఎంతైన జాగ్రత్తగా ఉండాలని కూడా కామెంట్లు చేస్తున్నారు.
అయితే.. ఈ వీడియోను చూసిన వారు మాత్రం పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కొంత మంది కనీసం షూస్ లను దులపకుండా.. అలానే దానిలోపల చేతులు పెడుతుంటారు. మరికొందరు పిల్లలు ఎంతో అజాగ్రత్తగా షూస్ లను ఆరుబైట పెడుతుంటారు. దీని వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు, పెద్దలు కూడా పాములు, ఇతరు విషపు జీవులతో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









