Giant Snake Video: అతి విషపూరితమైన నాగసర్పాన్ని పట్టుకున్న యువకుడు.. నీ ధైర్యానికి సలాం.. వీడియో చూస్తారా?

Most Giant Snake Video Viral Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అతి ప్రమాదకరమైన విషపూరితమైన భారీ నాగసర్పాన్ని పట్టుకుంటున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. వీడియో ఇంతలా వైరల్ కావడానికి గల కారణాలేంటో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 25, 2025, 08:02 AM IST
Giant Snake Video: అతి విషపూరితమైన నాగసర్పాన్ని పట్టుకున్న యువకుడు.. నీ ధైర్యానికి సలాం.. వీడియో చూస్తారా?

Most Giant Snake Video Watch Here: ప్రపంచంలోనే అతి  విషపూరితమైన పాము ఏదైనా ఉందంటే అది కేవలం అత్యంత పెద్ద కింగ్ కోబ్రానే.. ఈ పాములు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ చాలా ప్రమాదకరం. ప్రస్తుతం చాలామంది ఇలాంటి కింగ్ కోబ్రాలకు సంబంధించిన పాముల వీడియోలను ఎక్కువగా చూసి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కింగ్ కోబ్రాలను పట్టుకోవడం.. వాటిని తిరిగి అడవిలో వదిలిపెట్టడానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు. గతంలో పోస్ట్ చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఇటీవల వచ్చిన తుఫాన్‌లో కారణంగా కొండ ప్రాంతాల్లోని గుంటల్లో నీరు అధికంగా చేరి.. పైనుంచి వరద రూపంలో కిందికి చేరుకుంటుంది. ఇలా కిందికి చేరి నదుల్లో కలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే కొండపైన ఉండే పెద్ద పెద్ద కింగ్ కోబ్రాలు ఆ నీటి ప్రవాహం గుండా కొట్టుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఐదు నుంచి ఆరు మీటర్లు కలిగిన అతి విషపూరితమైన నాగుపాములు కూడా ఈ వరద ప్రవాహంలో కొట్టుకు వచ్చి జనావాసాల వద్దకు చేరుతున్నాయి. తాజాగా ఇలా కొండ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన ఓ అతి ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ఒకరి ఇంటి ముందు దర్శనం ఇచ్చింది. వీరు స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. 

స్నేక్ క్యాచర్స్ పాము ఉన్న ప్రదేశానికి చేరుకొని దానిని రక్షించేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో అతి ప్రమాదకరమైన భారీ కింగ్ కోబ్రా తన పడగలను విప్పి పైకి లేచి చూడడం మీరు గమనించవచ్చు. అయితే ఆ పాములు పట్టేవారు ముందుగా దానిని హిప్నోటైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా దాని తోక పట్టుకొని పట్టుకునే పట్టుకుని బంధించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. 

ఈ నాగుపాము వేగంగా వదలడం, దూకుడు స్వభావం కలిగి ఉండడంతో వారు ఎంత ప్రయత్నించిన దాడి చేసేందుకు ముందు ముందుకు వచ్చింది. వేగంగా కదులుతూ వారిపై పలుమార్లు దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే వారి చివరికి ఆ పాము తలభాగాన్ని పట్టుకొని సంచిలో బంధించారు. ఇలా సంచిలో బంధించిన పామును పర్వత ప్రదేశాల్లో వదిలిపెట్టారు. సాధారణంగా ఇలా పాములు పట్టేవారు ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారు అది దాడి చేసే క్రమంలో చాకచక్యంగా తప్పించుకోగలుగుతారు. సాధారణ వ్యక్తులు పాములు పట్టే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మీ సమీపంలో ఉన్న  అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేయండి.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News