)
Nagamani Snake Video Watch Here: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ చిన్న క్లిప్ వీడియో ఇప్పుడు చర్చనీ అంశానికి దారితీసింది.. ఎన్నో పౌరాణిక కథల్లో ప్రస్తావించిన నాగమణి నిజంగా ఉంటుందా అనే వారికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చూపించవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో లో కూడా అత్యంత ప్రమాదకరమైన పాము తలపై నాగమణి ఉండడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోని ఇంటర్నెట్లో చర్చనీ అంశానికి దారితీస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? ఇంతలా సోషల్ మీడియా వినియోగదారులను వీడియో ఆకట్టుకోవడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము తల భాగంలో ఏదో తెల్లని వజ్రం లాంటి ఆకారం కలిగి ఉన్న వస్తువును మీరు చూడొచ్చు. ఆ పాము దాని బరువు అటు ఇటు తోకను ఆడించడం కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఈ ఎనిమిది సెకండ్లు కలిగిన వీడియోని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామంది ఈ వీడియో చూసినవారు పాము అత్యంత అరుదైన నాగమణి వజ్రాన్ని కలిగి ఉందని అనుకుంటున్నారు. సాధారణంగా పాములు తలభాగం పైన వజ్రం లాంటి ఆకారం కలిగి ఉంటే అది నిజంగా అరుదైన నాగమణిని కలిగి ఉన్నట్లే.. అలాంటిది ఈ వీడియోలో కూడా దాని తలభాగంలో తల తల మెరుస్తున్న రత్నం మీరు చూడొచ్చు..
ఇప్పటికీ అనేకమంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు నాగమణి అనేది నిజమని నమ్ముతూ ఉంటారు.. ఇందులో భాగంగానే కొంతమంది పాములు పట్టుకునే వారు తీసుకువచ్చే పిచ్చి రత్నాలను వేల రూపాయలను పెట్టి విక్రయిస్తున్నారు. కొంతమంది అయితే నాగలోకానికి సంబంధించిన రత్నాలుగా భావించి కొనుగోలు చేస్తున్నారు. అయితే దీని కారణంగానే చాలామంది ఈ వీడియోలో పాము తలభాగానికి ఉన్నది అత్యంత అరుదైన నాగరత్నమని నమ్ముతున్నారు. కానీ ఈ వీడియోను క్లియర్ గా చూస్తే.. ఎవరో కావాలని పాము తలభాగానికి మెరిసే రాయిని అతికించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి