)
Two-headed King Cobra Viral Video Watch: మనం తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల పాములకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉంటాం. అందులో చాలా పాముల వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తాజాగా కూడా ఓ పాము కు సంబంధించిన వీడియో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియోలో పాముకు రెండు తలలు ఉండడం.. అది కూడా ఒకే వైపు రెండు తలలు ఉండడం ఆశ్చర్యమేస్తోంది. సాధారణంగా ఇలాంటి పాములు అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు తలలకు సంబంధించిన పాము వీడియో ఆక్వాటెర్రా అని యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ యువకుడు అరుదైన కాలిఫోర్నియా కింగ్ స్నేక్ (California King Snake) చేతిలో పట్టుకుని చూపించడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ యువకుడు ఏ మాత్రం భయపడకుండా పాము ను పట్టుకొని కెమెరాకు చూపిస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆశ్చర్యమేస్తోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న రెండు తలలో కింగ్ కోబ్రా పాలీసెఫాలీ అనే జన్యు లోపం కారణంగా జన్మించిందేనని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి పాములు చాలా అరుదుగా మాత్రమే జన్మిస్తాయని వారంటున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి పాములు కనిపిస్తూ ఉంటాయని సమాచారం. ఈ వీడియోలో పాము ఒకే శరీరం ఉండడం.. దీనికి తోడు తలభాగంలో రెండు తలలు ఉండడం మీరు చూడొచ్చు.. ప్రస్తుతం చాలామంది ఇలాంటి పాములను పెంచుకునేందుకు కూడా ఇష్టపడుతున్నారట. ప్రయోగశాలలో వీటిని పెంచి విక్రయిస్తున్నారని సమాచారం..
ఈ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 5000 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని లక్షల మంది ఈ వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్కొస్తున్నారు. మరి కొంతమంది ఈ వీడియోని షేర్ కూడా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook